Natyam ad

వ‌డ‌దెబ్బ‌కు తాళ‌లేక పోలీసు కానిస్టేబుల్ మృతి

మంచిర్యాల ముచ్చట్లు:


మంచిర్యాల జిల్లాలో విషాదం నెల‌కొంది. వ‌డ‌దెబ్బ‌కు తాళ‌లేక పోలీసు కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న రామ‌కృష్ణాపురం పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.వివ‌రాల్లోకి వెళ్తే.. మూతే సంతోష్(42) అనే వ్య‌క్తి రామ‌కృష్ణాపురం పోలీసు స్టేష‌న్‌లో కానిస్టేబుల్‌గా ప‌ని చేస్తున్నాడు. అయితే ఆదివారం త‌న విధుల‌ను ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు. రాత్రి 10:30 గంట‌ల స‌మ‌యంలో ఇంట్లోనే కుప్ప‌కూలిపోయాడు. దీంతో ఆ కానిస్టేబుల్‌ను కుటుంబ స‌భ్యులు ల‌క్సెట్టిపేట‌కు త‌ర‌లించారు. అక్క‌డ వైద్యులు ప‌రీక్షించి, చ‌నిపోయిన‌ట్లు నిర్ధారించారు. వ‌డ‌దెబ్బ కార‌ణంగానే మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. సంతోష్ 2000 ఏడాదిలో పోలీసు డిపార్ట్‌మెంట్‌లో చేరారు. ఆయ‌న‌కు భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు.

 

Tags: A police constable died due to sunburn

Post Midle
Post Midle