పంచభూతాల సాక్షిగా పేదింటి  యువతి పెళ్లి – కాళ్లు కడిగి కన్యాదానం చేసిన కందుల దంపతులు

పెద్దపల్లి  ముచ్చట్లు:
పేగుబంధం లేకుంటేనేం పెళ్లి చేసింది. రక్తసంబంధం లేకుంటేనే కాళ్లు కడిగి కన్యాదానం చేసింది. బంధువులకు భోజనాలు ఏర్పాటు చేసింది. ఉండెడ  గ్రామానికి చెందిన తల్లిదండ్రులను కోల్పోయిన నిరుపేద యువతి శ్రావణి వివాహానికి దేవుడు పంపించిన తల్లిదండ్రులుగా ముందుకు వచ్చి కాళ్లు కడిగి కన్యాదానం చేశారు కందుల దంపతులు. పేదింటి పెళ్లి అంటే సాదాసీదాగా తూతూ మంత్రంగా పెళ్లి జరుగుతుంది అని అనుకుంటారు. కానీ కందుల దంపతులు వారి సొంత కూతురి వివాహం ఎంత ఘనంగా జరిపిస్తారో  అంతే ఘనంగా బుధవారం  నిరుపేద యువతి వివాహం  జరిపించారు. పుస్తె మట్టెలు, తలంబ్రాలు, పట్టు వస్త్రాలు, భోజన ఏర్పాట్లు ఇలా పెళ్లికి కావలసిన అన్ని ఏర్పాట్లు వారే  చేసి శ్రావణికి నూతన జీవితాన్ని ప్రసాదించారు. సేవ అంటే ప్రాణంగా జీవించే కందుల సంధ్యారాణి నిరుపేద శ్రావణి వివాహం జరిపించి గ్రామ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే కార్యాన్ని జరిపించారు  అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. కన్నుల పండువగా జరిగిన వివాహాన్ని చూసిన గ్రామ ప్రజలు, ఇంత ఘనంగా వివాహం జరిపించిన కందుల దంపతుల ఋణం ఏమిచ్చి తీర్చుకోగలం  అన్నట్లుగా ప్రశంసలతో ముంచెత్తారు. నవ వధువు శ్రావణి మే కడుపున ఎందుకు పుట్టలేదా అని కంట తడి పెట్టడంతో  పెళ్లి చూడడానికి వచ్చిన బంధువులందరికీ కన్నీళ్లు వచ్చేలా చేసింది. కార్యక్రమంలో ఉండెడ గ్రామ సర్పంచ్ సుదగోని లావణ్య శ్రీనివాస్, మారేడు పల్లి సర్పంచ్ గందం లక్ష్మీ నారాయణ, రాకేశ్, శ్రీను, ఆవుల్ తిరుపతి, విలాసాగరం శ్రీనివాస్, ఎనగందుల శ్రీనివాస్, ఆనంద్, గందం రాజెంద్ర ప్రసాద్, స్థానిక ప్రజలు, వధువు, వరుడు తరపు బంధువులు..

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:A poor young woman marries as a witness to the Panchabhutas
– A couple of kandus who washed their legs and donated virginity

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *