Natyam ad

తలనొప్పిగా మారిన పోస్టు

మెదక్ ముచ్చట్లు:

సదాశిపేట మార్కెట్ కమిటీ రెండేళ్ల పదవీకాలం ముగిసి మూడు నెలలు దాటింది. పాలకవర్గం పదవీకాలం ముగిసిన వెంటనే జిల్లాలోని వివిధ వ్యవసాయ మార్కెట్ ల నూతన పాలకవర్గాలను ప్రకటించడంతోపాటు పదవీ బాద్యతలు స్వీకరించారు. సంగారెడ్డి పాలకవర్గానికి కంది మండల కేంద్రానికి చెందిన క్రిష్ణాగౌడ్ కు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకటించడంతోపాటు పదవీ బాద్యతలు స్వీకరించారు. కానీ సదాశివపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవీకాలం ముగిసి మూడు నెలలు దాటినా పాలకవర్గాన్ని ప్రకటించడం లేదు. దీనికి కారణం ప్రస్తుతం ఎస్సీ మహిళ రిజర్వేషన్ అయ్యింది.దీంతో కొండాపూర్, సదాశివపేటలలో ఆశావహుల సంఖ్య పెద్దదిగా ఉండడంతో అభ్యర్థి ఎంపిక క్లిష్టంగా మారింది. ఈసారి చైర్ పర్సన్ రేసులో కొండాపూర్ మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అభిమాని నాగయ్య, మాజీ సర్పంచ్ సత్యానందం, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ ప్రభుదాసు, గోపులారం గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు ప్రేమా నందం, మేజర్ పంచాయతీ మల్కాపూర్ గ్రామానికి చెందిన యువ నాయకుడు సొడాకుల కుమార్, మార్కెట్ కమిటీ రేసులో ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేస్తున్నారు.

 

 

 

మండల అధ్యక్ష పదవికి మల్లేశం రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాల వల్లే పదవికి న్యాయం చేయలేకపోతున్నానని రాజీనామా పత్రంలో పేర్కొన్నప్పటికీ రాజకీయ భాగం అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. గత నెల 11న మండల పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారని విశ్వాసనీయ సమాచారం. గతంలో సదాశివపేటకు జనరల్ కేటగిరి కింద సుధీర్ రెడ్డికి ఆకాశమిచ్చారు. ఈసారి ఎస్సీ మహిళ కొండాపూర్ కి ఇచ్చేందుకు అవకాశం ఉన్న స్థానిక నేతలు రెండు గ్రూపులుగా విడిపోయి సదాశివపేటకు ఇప్పించి వైస్ చైర్మన్ కొండాపూర్ కు ఇప్పించేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.మరో రెండేళ్ల తర్వాత బీసీ జనరల్ లో వచ్చే అవకాశం ఉన్నందున ఈసారి పేటకు ఇచ్చి మరోదఫాలో ఎలాగైనా బీసీ కోటలో పేట పీఠం దక్కించుకోవాలని ఉవ్విళ్లు ఉరుతున్నారు. పనులు పొందినవారే ఎలాగోలా ఫైనల్ చేసి మళ్లీ మళ్లీ పదవులు పొందుతున్నారని, మండలంలోని సీనియర్ నాయకులు, యువ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఎస్సీ. బీసీ రెండు సామాజిక వర్గాల అంతర్గతపోరుతో మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింత ప్రభాకర్ కు నాయకుల వ్యవహారం తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. చివరికి బాస్ దే పూర్తి బాధత్య అయినప్పటికీ అందరినీ సముదయంచడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.

 

Post Midle

Tags: A post that turned into a headache

Post Midle

Leave A Reply

Your email address will not be published.