రోడ్డు పైకి వంగిన విద్యుత్ స్థంభం
నల్గొండ జిల్లా ముచ్చట్లు:
చిట్యాల మండల పరిధిలోని గుండ్రా౦పల్లి -ఏపూర్ మధ్యలో కరెంట్ స్తంభాన్ని గుర్తుతెలియని వాహనం డీ కొనడడంతో కరెంట్ స్థంభం రోడ్డు పైకి ఒరిగింది. ఆ స్థంభం కేవలం వైర్ల మీద ఆధారపడి రోడ్ పై వెలాడటం తో ఆ దారి గుండా నిత్యం చిట్యాల,చౌటుప్పల్ గ్రామాలకు ప్రయాణం చేసే ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొనివెళుతున్నారు. ఏపూర్ గుండ్రా0పల్లి గ్రామాల మధ్య నిత్యం వందలాది మంది ప్రయాణం చేస్తారు. స్థంభం నేలకు వరగడంతో వాహనదారులు, పాదచారులు, భయబ్రాంతులకు గురిఅవుతున్నారు. ఇప్పటికయినా ప్రజాప్రతినిధులు,అధికారులు చొరవతీసుకొని స్థంబాలను పున్నారుద్దరించాలని కోరుతున్నారు.

Tags; A power pole bent over the road
