Natyam ad

రైతుల కోసం రూ.3 వేలకోట్లతో ధరల స్థీరీకరణ నిధి

– 2వేల మందికి సచివాలయం
-గ్రామంలోనే సౌకర్యాలు, పరిపాలన
-ప్రతి కార్యక్రమం పేదల సంక్షేమం కోసమే
-పేదరికమే అర్హతగా పథకాలు
-ఒకే కుటుంబం 30 సంవత్సరాలలో చేసింది శూన్యం

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వినూత్న ఆలోచనలతో బృహత్తరకార్యక్రమాన్ని రూపొందించి ధరల స్థీరికరణనిధికి రూ.3వేల కోట్లు కేటాయించారని రాష్ట్ర విద్యుత్‌, అటవీ, పర్యావరణ, గనులశాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. గురువారం పుంగనూరు మండలంలో సచివాలయలు, వైఎస్సార్‌హెల్త్ క్లీనిక్‌లు, ఆర్‌బికెలను మంత్రి ప్రారంభించి, పాలెంపల్లెలో వెహోక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాట ధర కల్పించేందుకు ధరల స్థీరికరణ నిధి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే వ్యవసాయపనిముట్లు, ఎరువులు, విత్తనాలు, రైతులకు సలహాలు, సూచనలు రైతుభరోసా కేంద్రాల నుంచి అందించడం జరుగుతోందన్నారు. గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడకుండ ఉండేందుకే ప్రజల ముంగిట సేవలు అందించేందుకు సచివాలయ వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రూపొందించారని తెలిపారు. 2 వేల జనాభాకు ఒకొక్క సచివాలయాన్ని ఏర్పాటు చేసి, వలంటీర్ల ద్వారా ప్రజలకు సేవలు అందించడం జరుగుతోందన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటిలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కమిటిల వారికే సంక్షేమ పథకాలు అందించారని , అర్హులకు ఒక్కరికి కూడ పథకాలు అందించలేదన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదరికమే ప్రామానికంగా సంక్షేమ పథకాలు సచివాలయాల ద్వారా ఆరు నెలలకు ఒక్కసారి అందించడం జరుగుతోందన్నారు.ముఖ్యమంత్రి ఏ కార్యక్రమం రూపొందించిన ప్రజాసంక్షేమం కోసమే చేపడుతున్నారని కొనియాడారు. పుంగనూరులో 30 సంవత్సరాలుగా ఎంపీ, ఎమ్మెల్యేలుగా ఉన్న వారు ఎలాంటి అభివృద్ది చేపట్టలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన వె ంటనే పుంగనూరు అభివృద్ధికి ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. 30 ఏళ్లలో జరగని అభివృద్ధిని నాలుగేళ్లలో చేపట్టామని మంత్రి తెలిపారు. ప్రజలు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనను చూసి ఆయనకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, జెడ్పి చైర్మన్‌ శ్రీనివాసులు, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, నియోజకవర్గ పరిశీలకుడు జింకావెంకటాచలపతి తదితరులు పాల్గొన్నారు.

బాబు అరెస్ట్ సంబంధం లేదు…

అవినీతి అక్రమాలలో జైలుకు వెళ్లిన చంద్రబాబు అరెస్ట్ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి ఎలాంటి సంబంధము లేదని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప తెలిపారు. పుంగనూరులో జరిగిన సభలో ఎంపీ మాట్లాడుతూ అవినీతి అక్రమాలపై కేంద్ర సంస్థలు పకడ్బంధిగా దర్యాప్తు చేసి , కేసులు సీఐడికి అందజేశారన్నారు. వాటిని అమలు చేయడం సీఐడి నేరమా అని ప్రశ్నించారు. ఎల్లోమీడియా చంద్రబాబు చేసిన అక్రమాలు ఇకనైనా గమనించి వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని కోరారు. జెడ్పి చైర్మన్‌ శ్రీనివాసులు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. వాటిని చూసి ప్రతిపక్ష పార్టీలకు కునుకులేకుండ పోయిందన్నారు. రాష్ట్ర ప్రజలు తిరిగి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని రెండవ సారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.

 

Tags; A price stabilization fund of Rs.3 billion for farmers

 

Post Midle