శంషాబాద్ పరిధిలో మహిళను హత్య చేసిన పూజారి

రంగారెడ్డి ముచ్చట్లు:


శంషాబాద్ లో ఒక మహిళ హత్యకు గురయింది. ఆమెతో  వివాహేతర సంబంధం పెట్టుకున్న పూజారే  మహిళను హత్య చేసినట్లు పోలీసులు నిర్దారించారు. తనను   పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో మహిళను పూజారీ  హత్య చేసాడు. నిందితుడఇకి  ఇదివరకే పూజారికి వివాహమై ఇద్దరు పిల్లలు వున్నారు.  తాజాగా ఆమెను కారులో ఎక్కించుకొని వచ్చి శంషాబాద్ పరిధిలోని నర్కుడ వద్ద తలపై రాయితో మోది హత్య చేసాడు.  అనంతరం మహిళా మృతదేహాన్ని కవర్ లో కట్టి కారులో తీసుకెళ్లి సరూర్ నగర్ లోనే మ్యాన్ హోల్ లో పడేసాడు.  ఆ తర్వాత ఏమి ఎరగనట్లు మహిళ కనిపించడం లేదని ఆర్ జి ఐ ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాడు. పోలీసులు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి అసలు విషయాలు బయటకు రాబట్టారు. మూడు రోజుల క్రితం మహిళ ను హత్య చేసిన పూజారి వెల్లడించాడు. నిందితుడు వెంకట సాయి సూర్య కృష్ణ, మృతురాలి పేరు అప్సర.

 

Tags; A priest who killed a woman in Shamshabad

Post Midle
Post Midle