దుర్గాదేవికి వైభవంగా ఊరేగింపు

A procession of splendor to Durga

A procession of splendor to Durga

Date:20/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని ఉబేదుల్లాకాంపౌండులో ఏర్పాటు చేసిన దుర్గామాతను శనివారం వైభవంగా అలంకరించి, పట్టణ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఆలయ కమిటి సభ్యులు గిరిధర్‌ ఆధ్వర్యంలో తొలిసారిగా దుర్గాదేవిని ఏర్పాటు చేసి, 9 రోజుల పాటు ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించి, పూజలు చేశారు. చివరి రోజు అమ్మవారిని ఊరేగింపు చేసి, మంజునాథ్‌చే ప్రత్యేక పూజలు చేసి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘ నాయకులు వినాయక, కుమార్‌, గంగాధర్‌, గంగామహేష్‌, రాంప్రసాద్‌, హేమంత్‌కుమార్‌ , విజయకుమార్‌, ప్రసాద్‌, పురుషోత్తం, పరమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి ప్రత్యేక అలంకారం …

పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద గల శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం స్వామివారిని, ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి, పూజలు నిర్వహించారు. నాల్గవ శనివారం సందర్భంగా భక్తుల రాకతో ఆలయం సందడిగా మారింది. గోవిందనామస్మరణతో భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఆలయంలో పూజలు చేసి, వెహోక్కులు చెల్లించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు.

కాంట్రాక్టుల పేరిట ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్న కేసీఆర్‌

Tags: A procession of splendor to Durga

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *