Natyam ad

స్త్రీ ఆరోగ్యం తోనే సుసంపన్న సమాజం : టీటీడీ బోర్డు సభ్యులు   పోకల అశోక్ కుమార్

-. నవంబర్ 7న టీటీడీ మహిళా ఉద్యోగుల కోసం స్క్రీనింగ్ పరీక్ష :
జె ఈవో  సదా భార్గవి

– ముగిసిన మూడు రోజుల క్యాన్సర్ అవగాహన కార్యక్రమం

స్త్రీ ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా,

 

Post Midle

తిరుపతి ముచ్చట్లు:


సు సంపన్నంగా ఉంటుందని టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులు   పోకల అశోక్ కుమార్ అన్నారు.
తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో శ్వేత ఆధ్వర్యంలో టీటీడీలోని మహిళా ఉద్యోగులకు మూడు రోజుల పాటు నిర్వహించిన క్యాన్సర్‌పై అవగాహనా కార్యక్రమం ఆదివారం ముగిసింది . ముగింపు సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న   అశోక్ కుమార్ మాట్లాడుతూ , ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ఆహారపు అలవాట్లను పాటించాలన్నారు. మహిళలు ఎల్లప్పుడూ తమ కుటుంబ సంక్షేమం గురించి ఆలోచిస్తూ , వారి వ్యక్తిగత ఆరోగ్యాన్ని విస్మరిస్తారని చెప్పారు . మహిళలందరూ తమ కోసం కనీసం ఒక గంట సమయం కేటాయించాలని, శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండటానికి వ్యాయామం ,యోగా , ధ్యానం లేదా వాకింగ్ చేయాలని కోరారు . కుటుంబాల్లోని మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు .

 

 

మూడు రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జెఈవో   సదా భార్గవి , ఆమె బృందానికి ఆయన అభినందనలు తెలిపారు.జెఈవో   సదా భార్గవి మాట్లాడుతూ , క్యాన్సర్‌పై మూడు రోజుల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీలోని 1540 మంది మహిళా ఉద్యోగులను అభినందించారు. మహిళలు రొమ్ము, గర్భాశయ, అండాశయ క్యాన్సర్‌లకు గురయ్యే అవకాశం ఉన్నందున, మూడు రోజుల కార్యక్రమం వారికి పూర్తి అవగాహన కల్పించుకోవడానికి ఉపయోగపడిందని అభిప్రాయపడ్డారు . మహిళలు తాము ఆరోగ్యాంగా ఉండటమే కాకుండా , సమాజాన్ని కూడా ఆరోగ్యంగా మార్చడానికి కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె చెప్పారు . నవంబర్ 7వ తేదీని ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటున్నందున, టాటా క్యాన్సర్ , స్విమ్స్ ఆసుపత్రుల సహాయంతో మహిళా ఉద్యోగులందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించే ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు.

 

 

వేలూరు, కీసరగుట్టలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు . తమకు ఉపయోగపడే కార్యక్రమానికి ప్రతి మహిళా ఉద్యోగిని పంపించడంలో చొరవ చూపినందుకు హెచ్ ఓడి లకు అన్ని యూనియన్ నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.అంతకుముందు టాటా క్యాన్సర్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శివకుమార్ ప్రసంగించారు . ఉదయం సెషన్‌లో న్యూట్రిషనిస్ట్, ఉమెన్ వెల్నెస్ కన్సల్టెంట్   పి దీప్తి, టిటిడి శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీ టెక్నికల్ సూపర్‌వైజర్ డాక్టర్ నారపరెడ్డి మాట్లాడారు. చివరగా మహిళా ఉద్యోగులందరికీ క్యాన్సర్ పై అవగాహనకు సంబంధించి 20 ప్రశ్నలకు జవాబులు సేకరించగా అందరికీ 18 మార్కులకు పైగా రావడం విశేషం.ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన డ్యాన్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.కార్యక్రమంలో శ్వేత డైరెక్టర్   ప్రశాంతి సీనియర్ అధికారులు, పాల్గొన్నారు.

Tags: A prosperous society only with women’s health: TTD board members Pokala Ashok Kumar

Post Midle

Leave A Reply

Your email address will not be published.