గిరిజనుల సమస్యలకు సత్వర పరిష్కారం

Date:19/09/2020

హైదరాబాద్ ముచ్చట్లు:

గిరిజన సంక్షేమ శాఖ లో అమలవుతున్న పథకాలు లబ్దిదారులకు చేరడంలో మరింత సమర్ధవంతంగా పనిచేయడం, గిరిజన విద్యాలయాలు పునః ప్రారంభం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన విద్యార్థుల ఇంటి వద్దకే  ఉపాధ్యాయులు వెళ్లి పాఠాలు చెప్పడం, ఐటీడీఏ లలో గిరిజన సమస్యల్ని సత్వర పరిష్కారం చేయడం పై హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నేడు జరిగిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, జిల్లాల గిరిజన అభివృద్ధి అధికారుల సమీక్షా సమావేశంలో రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి  సత్యవతి రాథోడ్  మాట్లాడారు. సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడుతూ కోవిద్ సమయంలో ఆగిపోయిన పనులను పూర్తి చేయాలి. ముఖ్యమంత్రి కేసిఆర్  ఆలోచన తో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వచ్చినా, పరిశ్రమలు వచ్చినా ఇవి గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఉపయోగపడేలా పని చేస్తున్నాం. గిరిజన గ్రామాల్లో 3 ఫేజ్ కరెంట్ కోసం 117కోట్ల రూపాయలు కేటాయించాము. వికారాబాద్, మహబూబాబాద్ జిల్లాలకు పాడి పశువులను ఇవ్వడం ఒక పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నామని అన్నారు.

 

వీటిని సరైన విధంగా అమలు చేయడం, అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేయడం పై చర్చించాము. ఎకానామిక్ సపోర్ట్ స్కీమ్స్ కింద ఇప్పటికే దాదాపు 500 మంది గిరిజన యువతకు ఓనర్ కమ్ డ్రైవర్ పథకంలో కార్లు ఇచ్చాం. గిరిజన సంక్షేమ శాఖ లో అమలు చేస్తున్న పథకాలు నిజమైన లబ్ది దారులకు అందేందుకు మా అధికారులు వారధులుగా పని చేయాలని చెప్పాం. ముఖ్యమంత్రి  ఆలోచన మేరకు ఈ రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ చాలా పకడ్బందీగా పని చేస్తుందనే విశ్వాసాన్ని పెంచేందుకు ఈ సమావేశం నిర్వహించుకున్నాము. కోవిడ్ నేపథ్యంలో ఏజెన్సీ లో సరైన వసతులు లేని గిరిజన విద్యార్థుల వద్దకు వెళ్లి విద్యా బోధన చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ఇలా ప్రతి కార్యక్రమంలో లబ్దిదారుల మేలు లక్ష్యంగా పని చేయడమే మా ఉద్దేశ్యమని ఆమె అన్నారు.

కర్ణాటకలో మళ్లీ వర్ష బీభత్సం..లోతట్టు ప్రాంతాలు జలమయం!

Tags: A quick solution to tribal problems

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *