-హజరయిన ఆర్.కె రోజా కుటుంబ సభ్యులు
Date:15/01/2021
చిత్తూరు ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలం ఏ.రంగంపేట లో శుక్రవారం జల్లికట్టు నిర్వహించారు. శుక్రవారం ఏ.రంగంపేట గ్రామం, పుల్లయ్య రి పల్లెలో ప్రారంభమైన జల్లికట్టు కోసం పోలీసులు భారీగా మోహరించారు. పల్లెటూరులో పచ్చని తోరణాలతో జల్లికట్టు కు ముస్తాబు చేసిన గ్రామస్థులు,చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా యువత, జనాలు తరలివచ్చారు. రంకెలు వేసే పోట్ల గిత్తలు, వాటిని నిలువరించే క్రమంలో యువకులు అందరినీ ఆకర్షించారు. కుటుంబ సభ్యులతో కనుమ పండుగ రోజు తన నివాసంలో గోమాతకు పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ఆర్.కె రోజా తరువాత పుల్లయ్య గారి పల్లె లో జల్లికట్టు లో పాల్గొన్నారు. సినీనటుడు మోహన్ బాబు కుమార్తె ,మంచు లక్ష్మి, కుమారుడు మంచు మనోజ్ లు కుడా పాల్గోన్నారు.
సదుంలో శ్రీ అయ్యప్పస్వామికి అభరణాలు సమర్పిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి , ఎంపీ మిధున్‌రెడ్డి
Tags: A. Rangampeta is rich in jallikattu