పూడ్చి పెట్టిన బాలిక శవం పై అత్యాచార యత్నం

Date:22/05/2020

అస్సాం ముచ్చట్లు:

కొన్ని ఉదంతాలు విన్నంతనే ఒళ్లు గగుర్పాటుకు గురి కావటమే కాదు.. ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నామన్న భావన కలగటం ఖాయం. కలలో కూడా ఊహించని వికారానికి పాల్పడిన ఈ దుర్మార్గుడికి ఎలాంటి శిక్ష విధించినా తప్పు లేదనే పరిస్థితి. కాస్త ఆలస్యంగా బయటకొచ్చిన ఈ ఉదంతం వింటే.. మనుషులు మరీ ఇంత పైశాచికంగా మారిపోతున్నారే? అన్న భయాందోళనలు కలగటం ఖాయం. అసోంకు చెందిన ఒక పద్నాలుగేళ్ల బాలిక ఇటీవల అనుమానాస్పద రీతిలో ఈ నెల 17న మరణించింది. ఆమెను వారి కుటుంబీయులు తమకు దగ్గర్లోని సైమన్ నదీ తీరంలో అంతిమ సంస్కారాల్ని పూర్తి చేశారు. వారి ఆచారంలో భాగంగా శవాన్ని పాతి పెట్టారు. ఇదిలా ఉంటే.. అంతిమ సంస్కారాలు పూర్తి చేసిన రోజు తర్వాత.. 51 ఏళ్ల అకాన్ సైకియా అనే వ్యక్తి.. బాలికను ఖననం చేసిన ప్రాంతానికి వెళ్లాడు.

 

 

అందులో నుంచి శవాన్ని బయటకు తీశాడు. అప్పుడే అటుగా వెళుతున్న ఒక జాలరి ఈ ఉదంతాన్ని చూశాడు. శవాన్ని బయటకు తీసి.. అత్యాచార యత్నం చేసే ప్రయత్నం చేశాడు. దీంతో షాక్ తిన్న అతడు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగి.. ఆ దరిద్రుడ్ని అదుపులోకి తీసుకున్నాడు. అతడు చేస్తున్న పనిని చూసి షాక్ తిన్నారు.ఈ విషయాన్ని తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు తీవ్రమైన ఆవేదన చెందారు. వైద్య పరీక్షల కోసం ఆమె శవాన్ని ఆసుపత్రికి తరలించేందుకు అనుమతి కోరగా వారిచ్చారు. ఈ దారుణానికి పాల్పడిన సైకియాకు గతంలో రెండు సార్లు పెళ్లిళ్లు అయినట్లుగా గుర్తించారు. రెండేళ్ల క్రితం మొదటి భార్య పెట్టిన కేసులో జైలుశిక్షను అనుభవిస్తున్నాడు. మాయదారి రోగం ఖైదీలకు అంటుతుందన్న ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా కొందరు ఖైదీలకు పెరోల్ మంజూరుచేయటం తెలిసిందే. ఈ క్రమంలోనే సైకియా విడుదల అయ్యాడని..  ఇలాంటి దారుణానికి పాల్పడతాడని ఊహించలేదంటున్నారు. ఇలాంటివాడికి ఎలాంటి శిక్ష విధించినా తప్పులేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

క్వారంటైన్ లో లైంగిక వేదింపులు.. నరకం చూపించిన కామాంధులు

Tags: A rape attempt on the corpse of a buried girl

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *