Natyam ad

అలుపెరుగని సేవలకు అరుదైన సత్కారం

కడప ముచ్చట్లు:

 

తమ తమ విధుల్లో ప్రతిభచూపుతూ సేవారంగాల్లో కూడా విలక్షణమైన కృషినందిస్తున్న అలుపెరుగని సేవలకు తాము అరుదైన సత్కారం అందిస్తున్నామ ని లయన్స్‌ పాస్ట్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ కె. చిన్నపరెడ్డి అన్నారు.  లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కడప అన్నమయ్య, రాయలసీమ టూరిజం అండ్‌ కల్చరల్‌ సొసైటి, కడప హోటలర్స్‌ అసోసియేషన్‌ ఉమ్మడి ఆధ్వర్యంలో గురువారం కడప నగరం మానస ఇన్‌ సమావేశ మందిరంలో ప్రొద్దుటూరు 1 సర్కిల్‌ జిఎస్టీ అసిస్టెంట్‌ కమిషనర్‌ మోరంరెడ్డి వేణుగోపాల్‌ రెడ్డి, ఆంగ్లోపాధ్యాయు లు లయన్‌ డా. గునిశెట్టి శ్రీనివాసులును ఘనంగా సత్కరించారు.  వారి విశిష్ట సేవలకు ఆగష్టు 15న అజాది కా అమృత్‌ మహోత్సవ్‌ ప్రశంసాపత్రాన్ని కలెక్టర్‌ విజయరామరాజు, జిల్లా ఇన్‌చార్జి ఆదిమూలపు సురేష్‌ల ద్వారా అందుకున్నారు.  ఈ సందర్భంగా లయన్‌ చిన్నపరెడ్డి అధ్యక్షతన సత్కార సభ నిర్వహించారు.  రాయలసీమ టూరిజం అండ్‌ కల్చరల్‌ సొసైటి ప్రధాన కార్యదర్శి కొండూరు జనార్దన రాజు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నపరెడ్డి మాట్లాడుతూ అంకితభావంతో బాధ్యతలు నిర్వహించే అధికారిగా మోరంరెడ్డి వేణుగోపాల్‌ రెడ్డి ప్రభుత్వ అధికారుల ప్రశంసలందుకున్నారని సామాజిక సేవారంగాలపై మక్కువతో ఆయన చేస్తున్న కార్యక్రమాలను గుర్తించి అజాది కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా జిల్లా అధికారులు ఆయన సేవలను గుర్తించడం ప్రశంసనీయమన్నారు.  ఉపాధ్యాయునిగా జాతిని నిర్మించే బాధ్యతను ప్రతిభావంతంగా నిర్వర్తిస్తూ అటు ఆంగ్లభాష అభివృద్ధితో అంచెలంచెలుగా అంతర్జాతీయ స్థాయి ఖ్యాతినందుకొన్న గునిశెట్టి శ్రీనివాసులు నేడు జిల్లా అధికారుల ప్రశంసలు కూడా పొందడం లయన్స్‌ క్లబ్‌కు గర్వకారణమన్నారు.

 

 

 

 

వారిద్దరిని సత్కరించుకోవడం తమ క్లబ్‌ సభ్యులందరినీ సత్కరించుకున్నట్లుగా భావిస్తున్నామన్నారు.  ముఖ్యఅతిథి ప్రభుత్వ పురుషుల కళాశాల ప్రిన్సిపాల్‌ డా. రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ తన విద్యా ప్రస్థానాన్ని ఉన్నతస్థాయికి చేరేందుకు ఎదుర్కొన్న సమస్యలను వివరించి స్ఫూర్తినింపారు.  ప్రముఖ ఆర్థో డాక్టర్‌ సి. విద్యాసాగర్‌ రెడ్డి సత్కారగ్రహీతలను ప్రత్యేకంగా ప్రశంసించారు.  లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కడప అన్నమయ్య అధ్యక్షులు డా. ఆర్‌. రంగనాథ రెడ్డి, కార్యదర్శి వి. గౌరి శంకర్‌ మాట్లాడుతూ తమ క్లబ్బు సభ్యులు జిల్లాస్థాయిలో అధికారుల ప్రశంసలు పొందడం క్లబ్బు సభ్యులకు స్ఫూర్తినివ్వగలదన్నారు.  సత్కార గ్రహీతలు మోరంరెడ్డి వేణుగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రశంసలు ప్రతిభను ఇనుమడింపజేస్తాయని సేవారంగంలో తాను ఎంతో ఉత్తేజం పొందుతున్నానని స్వామి వివేక స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామని తెలిపారు.  రాయలసీమ టూరిజం సంస్థ తనలో ఉత్తేజం నింపిందని సాంస్కృతిక కార్యక్రమాలవైపు మళ్ళించగా లయన్స్‌ క్లబ్‌ సామాజిక కార్యక్రమాలపై ఆకర్షించిందన్నారు.

 

 

 

Post Midle

లయన్‌ గునిశెట్టి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎదగాలన్న తపన ఉంటే ఏ స్థాయికైనా చేరుకోవచ్చునని సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తించిన వారే సంఘంలో నిజమైన మనిషిగా గుర్తింపు పొందగలరన్నారు.  ఈ అవార్డుతో పాటు లయన్స్‌ క్లబ్‌ సభ్యత్వం తన బాధ్యతను మరింతగా పెంచిందన్నారు.  కడప హోటలర్స్‌ అసోసియేషన్‌ కోశాధికారి లయన్‌ రషీద్‌ ఖాన్‌ కూడా సత్కార గ్రహీతలను అభినందించి సత్కరించారు.  కార్యక్రమంలో లయన్‌ కె. సంజీవ రెడ్డి, లయన్‌ పోతుల వెంకట్రామిరెడ్డి, ఓంశాంతి పవన్‌, బ్లడ్‌ టు లివ్‌ పవన్‌, కె.వి. రమణా రెడ్డి, దేవతి (హచ్‌) రవి, కొండా రెడ్డి, పలువురు లయన్స్‌ క్లబ్‌, రాయలసీమ టూరిజం సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు.

 

Tags: A rare honor for tireless service

Post Midle

Leave A Reply

Your email address will not be published.