Natyam ad

పురిటిగడ్డలో అరుదైన శిలా శాసనం..ఏకంగా ఇక్ష్వాకుల

కాలంనాటిది అని నిర్ధారించిన….శాస్త్రవేత్తలు

 

కృష్ణా  ముచ్చట్లు:

 

Post Midle

భారతదేశం గొప్పతనం, కీర్తి ప్రతిష్టలను మాటల్లో చెప్పలేం. మన దేశ గొప్పతనాన్ని, చరిత్రను తెలియజేస్తూ.రాజుల కాలంనాటి పరాక్రమాలను, అప్పటి పరిస్థితులను, చెప్పుకోదగ్గ విషయాలను శాసనాలుగా, శిలాఫలకాలుగా ఏర్పాటు చేస్తూ ఉంటారు.కాలక్రమంలో అవన్నీ మరుగున పడిపోయాయి. కానీ, పురావస్తు శాస్త్రవేత్తల పుణ్యమా అని ఇప్పటికీ అరుదైన, గొప్ప గొప్ప శాసనాలు, అరుదైన శిల్పాలు బయల్పడుతూనే ఉన్నాయి.తాజాగా కృష్ణా జిల్లాలో కూడా ఒక అరుదైన ప్రాకృత శాసనం ఒకటి లభించింది.అది ఇక్ష్వాకుల కాలం నాటిది అంటూ పురావస్తు శాస్త్రవేత్తలు వెల్లడించారు.విగ్రహాన్ని.. దాని వెనుక ఉన్న శాసనాన్ని పరిశీలించిన కేంద్ర పురావస్తు శాఖ విభాగం సంచాలకులు కె. మునిరత్నంరెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ శాసనం చాలా పురాతనమైనదిగా ప్రకటించారు. ఆ పోతురాజు విగ్రహం ఇక్ష్వాకుల కాలం నాటిది అని స్పష్టం చేశారు. అలాగే ఆ విగ్రహం వెనుక ఉన్న పదాలు బ్రహ్మి లిపిలో ఉన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఆనందుడు అనే బౌద్ధాచార్యుడు ఆ విగ్రహాన్ని ప్రతిష్టించిన వివరాలు ఆ విగ్రహం వెనుక రాసి ఉన్నట్లు తెలిపారు. అయితే విగ్రహం పగిలి ఉండటం వల్ల కొన్ని అక్షరాలు లేకపోవడంతో పూర్తి వివరాలు తెలియరాలేదని వ్యాఖ్యానించారు.

 

 

ఈ పల్నాటి ప్రాంతానికి చెందిన సున్నపురాతి విగ్రహంపై ఒకవైపు పోతురాజు విగ్రహం ఉంది. మరోవైపు బ్రహ్మి లిపిలో ప్రతిష్టించిన వివరాలు ఉన్నాయి. అలాగే మరోవైపు బిడ్డను పట్టుకున్న ఒక తల్లి ఫొటో ఉందని శివనాగిరెడ్డి వెల్లడించారు. మన చరిత్రను, మన నేల గొప్పతనాన్ని తెలియజేసే శాసనాలు, విగ్రహాలను భద్రపరుచుకోవాలి అని శివనాగిరెడ్డి వ్యాఖ్యానించారు. మన భవిష్యత్ తరాలకు మన చరిత్రను తెలియజేసుందుకు ఈ విగ్రహం ప్రతిబింబాన్ని ఆలయం వద్ద ప్రదర్శించి.. వారికి తెలియజేయాలని గ్రామస్థులకు సూచించారు. పురిటిగడ్డ గ్రామంలోని పోతురాజు విగ్రహం ఇక్ష్వాకుల కాలంనాటిదని తెలుసుకుని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

 

Tags; A rare rock inscription in Puritigadda..Enganga Ikshvakula

Post Midle