Natyam ad

నెల్లూరు వాసి బాపట్ల లో హత్య

బాపట్ల ముచ్చట్లు:

బుధవారం రాత్రి బాపట్ల పాత బస్టాండ్ సెంటర్లో కిరాతకంగా కత్తులతో దాడి చేసిన సంఘటనలో గుర్తు తెలియని వ్యక్తి మృతి కేసును బాపట్ల పోలీసులు చేధించారు.మృతుడు నెల్లూరు పట్టణంలోని పెన్నానది ఒడ్డున వైఖుంటపురమున కు చెందిన ప్రశాంత్ (24)సంవత్సరాలుగా  గుర్తించారు.ప్రశాంత్ గత కొద్ది రోజులు క్రితం ఓ హత్య కేసులో బెయిల్ పై జైలు నుండి విడుదల అయ్యారు.ప్రశాంత్ తండ్రి బాపట్ల లో ఉన్నాడని తెలిసి బాపట్ల వచ్చినట్లు సమాచారం.పథకం ప్రకారమే నెల్లూరుకు చెందిన వ్యక్తులే ప్రశాంత్ నీ హత్య చేసి కారులో పరారై ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Post Midle

Tags: A resident of Nellore was murdered in Bapatla

Post Midle