పుంగనూరులో వినాయక చవితి ఏర్పాట్లపై సమీక్ష
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలో వినాయక చవితి పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు, నిర్వాహకులచే శనివారం సమీక్ష నిర్వహించారు. మున్సిపాలిటిలో కమిషనర్ నరసింహప్రసాద్, చైర్మన్ అలీమ్‌బాషా, సీఐ గంగిరెడ్డితో కలసి సమావేశం జరిగింది. చైర్మన్ మాట్లాడుతూ పండుగను ప్రశాంతంగా నిబంధనల మేరకు ప్రతి ఒక్కరు జరుపుకోవాలని కోరారు. సీఐ గంగిరెడ్డి మాట్లాడుతూ పట్టణంలో వినాయకుడి విగ్ర హాల ఏర్పాట్లలో ట్రాఫిక్ సమస్య లేకుండ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే ఎలాంటి వివాదాలకు తావులేకుండ ప్రభుత్వ అనుమతితో విగ్రహాల ఏర్పాటు, నిమజ్జనం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు నాగేంద్ర, సిఆర్.లలిత, అగ్నిమాపకశాఖాధికారి సుబ్బరాజు, మున్సిపల్ మేనేజర్ రసూల్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Tags: A review of Vinayaka Chavithi arrangements in Punganur
