Date:22/01/2021
తాండూరు ముచ్చట్లు:
వికారాబాద్ జిల్లా తాండూర్ వచ్చిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కి యువకులు మంబాపూర్ నుండి తాండూర్ వరకు బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు.రాజీవ్ కాలనీ వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యేను వారు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వెంటే తాండూర్ యువత ఉన్నారని గత కొన్ని సంవత్సరాల నుండి పెండింగ్‌లో ఉన్న పనులు ఇప్పుడు జరుగుతుండటంతో అభివృద్ధి పనులు చూసి ఎవరూ లేక కొంతమంది పార్టీలకు చెందిన యువకులను వెంట వేసుకొని ఆరోపణలు చేస్తున్నారని ఇది ఎంత మాత్రం సమంజసం కాదని వారు ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉండి బూజు పట్టిన బైపాస్ రోడ్ ఫైలు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి, కేటీఆర్ సహకారంతో పనులు మొదలెట్టేలా చేసిన ఘనత ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దిఅని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో ఇంత్యసే పటేల్. ఇబ్రహీం. రమేష్. తదితరులు పాల్గొన్నారు.
పుంగనూరులో 23న జాబ్‌మేళాను ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి
Tags: A rich tribute to the MLA