Natyam ad

క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ రాజ్యాంగం: సీఎం జగన్

-రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌, సీఎం జగన్‌

 

అమరావతి ముచ్చట్లు:

Post Midle

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్‌ చిత్రపటానికి గవర్నర్‌, సీఎం నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, 80 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన రాజ్యాంగం రూపొందించారన్నారు. ”భారత రాజ్యాంగం ఎంతో గొప్పది. అందరికీ క్రమశిక్షణ నేర్పే రూల్‌ బుక్‌ రాజ్యాంగం. అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. అనేక కులాలు, మతాలతో మిళితమైనది మన దేశం. 72 ఏళ్లుగా ఈ రాజ్యాంగం సామాజిక వర్గాల చరిత్రను తిరగరాసింది” అని సీఎం జగన్‌ అన్నారు.”రాజ్యాంగం అణగారిన వర్గాలకు అండగా నిలిచింది. రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్‌కు అంజలి ఘటిస్తున్నాం. 2023 ఏప్రిలో బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నాం. గ్రామ స్వరాజ్యానికి రూపకల్పన చేసిన ప్రభుత్వం మనది. గ్రామ సచివాలయ వ్యవస్థతో మార్పులు తీసుకొచ్చాం” అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.”గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను అమలు చేస్తున్న తొలి రాష్ట్రం ఏపీ. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మైనార్టీలకు 50 శాతం ఇస్తున్న ప్రభుత్వం మనదే. అక్కాచెల్లెమ్మల పేర్లతోనే ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. అభివృద్ధి, అనేక సంక్షేమ పథకాలతో తారతమ్యాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. మంత్రి మండలిలో 70 శాతం బీసీలు, ఎస్సీలు,ఎస్టీలు, మైనార్టీలే. స్పీకర్‌గా బీసీని, మండలి ఛైర్మన్‌గా ఎస్సీని, మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మైనారిటీ వ్యక్తిని నియమించాం” అని సీఎం అన్నారు.

 

Tags: A rule book constitution that teaches discipline: CM Jagan

 

Post Midle