అప్పు తిరిగి చెల్లించనందుకు వ్యక్తిపై కొడవలితో దాడి

Date:07/08/2020

పీలేరు ముచ్చట్లు:

పీలేరు మండలంలో తీసుకున్న అప్పు డబ్బును తిరిగి ఇవ్వమన్నుందుకు వ్యక్తిపై మరో వ్యక్తి కొడవలితో దాడి చేశాడు.పీలేరు మండలంలోని బోడుమల్లువారి పల్లెకు చెందిన శంకర్ నారాయణ రెడ్డి.. పీలేరు పట్టణంలోని మోడల్ కాలనీకి చెందిన వినోద్‌ కుమార్‌ రెడ్డికి రూ. 5 లక్షల మేర అప్పు ఇచ్చాడు. ఇదే విషయమై శంకర్ నారాయణ రెడ్డి.. వినోద్‌ను నిలదీసి అడిగాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన వినోద్.. శంకర్ నారాయణపై కొడవలితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శంకర్ నారాయణ రెడ్డిని పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మత్తు నుండి ప్రజల విముక్తి కోసం ఏడు రోజులపాటు స్పెషల్ డ్రైవ్

Tags: A scythe attack on a person for not repaying a loan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *