డీకేటీ భూమికి నకిలీ రికార్డులు మరియు స్టాంప్ లను తయారు చేసిన ముగ్గురిపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు
-సీఐ మద్దయ్యచ్చారి
చిత్తూరు ముచ్చట్లు:
ఆదివారం చిత్తూరు టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిత్తూరు నగరంలోని ఇరువారానికి చెందిన అరుణ తన తండ్రిపేరుపై ఉన్న డీకేటీ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుని బ్యాంకులో రుణం పొందాలని అనుకున్నారు.ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయించాలని చిత్తూరు రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయ అధికారులను కోరగా.. రిజిస్టర్ కాదని చెప్పారు.దాంతో డాక్యు మెంట్ రైటర్లు అయిన సుందర్రాజ్, ప్రిన్స్జ్లను ఆమె ఆశ్రయించారు.వారు చిత్తూరు తహసీల్దార్, సర్వేయర్ పేరిట నకిలీ సీళ్లను సిద్ధం చేసి, నకిలీ రికార్డులు పకడ్బందీగా తయారుచేసి, రిజిస్ట్రేషన్ కోసం సమర్పించారు.అయితే రిజిస్ట్రేషన్ అధికారు లకు డీకేటీ భూమి రికార్డులపై అనుమానం రావ డంతో పునఃపరిశీలన కోసం తహసీల్దార్ కార్యాల యానికి పంపించారు.రికార్డులను క్షుణ్ణంగా పరిశీ లించిన రెవెన్యూ అధికారులు వాటిపై ఉన్న నీళ్లు తమవి కావని.. రికార్డులు నకిలీవని నిర్ధారించుకుని రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.శని వారం సీఐ తమ సిబ్బందితో రిజిస్ట్రేషన్ కార్యాల యానికి వెళ్లి విచారణ చేపట్టారు.నకిలీ నీళ్లు, రికా ర్డుల తయారీ నిజమని తేలడంతో తహసీల్దార్ కిరణ్ ఇచ్చిన ఫిర్యాదుతో అరుణ, డాక్యుమెంట్ రైటర్లు సుందర్రా రాజ్, ప్రిన్స్ రాజుపై కేసు నమోదు చేశారు.కాగా, డాక్యుమెంట్ రైటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చిత్తూరు టూ టౌన్ సీఐ మద్యఆచారి తెలిపారు.

Tags: A second case has been registered by the city police against three people for making fake records and stamps for DKT land
