అలోక్ వర్మ పిటీషన్ పై రెండో రోజు విచారణ

A second day trial on Alok Verma Petition

A second day trial on Alok Verma Petition

Date:06/12/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
తనను రాత్రికి రాత్రే సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ దాఖలుచేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానంలో వరుసగా రెండు రోజు విచారణ కొనసాగింది. సీబీఐ డైరెక్టర్ ఆలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్‌ అస్థానాలను రాత్రికి రాత్రే ఎందుకు సెలవుపై పంపించారని కేంద్రాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వం తీసుకునే చర్యలు సంస్థ ప్రతిష్ఠను కాపాడేలా ఉండాలని పేర్కొంది. దీనికి స్పందించిన అటార్నీ జనరల్ గత జులై నుంచి ఇద్దరి మధ్య ప్రచ్చన్న యుద్ధం మొదలైందని అన్నారు. గత జులై నుంచి వాళ్లని భరిస్తున్నామన్నారు.. మరి అకస్మాత్తుగా ఎందుకు సెలవుపై పంపించారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. సీబీఐ చీఫ్‌ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు సెలక్షన్‌ కమిటీని ఎందుకు సంప్రదించలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ ఆలోక్‌, అస్థానాలపై చర్యలు తీసుకోవడానికి దారితీసిన పరిణామాలు రాత్రికి రాత్రే జరగలేదు. మీరు అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవడానికి కారణం అది కాదు’ అని సర్వోన్నత న్యాయస్థానం జస్టిస్ గొగొయ్‌ అభిప్రాయపడ్డారు.
బుధవారం జరిగిన విచారణలో.. అనివార్య కారణాల వల్ల అలోక్ వర్మ, రాకేశ్ ఆస్థానాలను సెలవుపై పంపాలని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ వెల్లడించారు. ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య మొదలైన వివాదం ఎప్పుడు, ఎలా ముగుస్తుందనేది ఆ దేవుడికే తెలుసని వ్యాఖ్యానించడం గమనార్హం. వారు గత కొన్ని నెలల నుంచి పిల్లులు మాదిరిగా గొడవ పడటంతో సీబీఐ ప్రతిష్ఠ అపహాస్యం పాలైందని.. అందుకే తాము జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలియజేసింది. సీబీఐ కేసుల దర్యాప్తునకు బదులుగా వారే ఒకరిపై ఒకరు దర్యాప్తు చేసుకుంటున్నారని కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ సుప్రీంకోర్టుకు తెలిపింది. సీవీసీ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపిస్తూ.. అనుకోని పరిణామాలను కూడా సీవీసీ ఎదుర్కోవాల్సి వస్తుందని, తగిన విధంగా స్పందించాల్సి వస్తుందని, లేదంటే ప్రభావ రహితంగా మారుతుందని అన్నారు. సీబీఐ అంశంపై సీవీసీ దర్యాప్తు చేపట్టిందని, కానీ ఆలోక్‌ వర్మ కొన్ని నెలల పాటు సంబంధిత దస్త్రాలను తమకు అప్పగించలేదని కోర్టుకు నివేదించింది.
Tags:A second day trial on Alok Verma Petition

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *