అండమాన్‌ అండ్‌ నికోబార్‌ దీవులను వణికిస్తున్న వరుస భూకంపాలు

న్యూ డిల్లీ  ముచ్చట్లు:


అండమాన్‌ అండ్‌ నికోబార్‌ దీవులను భూకంపాలు వణికిస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో వరుసగా భూకంపాలు సంభవించడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం ఉదయం 5.57 గంటలకు రిక్టర్‌ స్కేల్‌పై 5.0 తీవ్రతతో బలమైన ప్రకంపనలు వచ్చాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపింది. అయితే, ఇప్పటి వరకు ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు.భూకంపం అండమాన్‌ రాజధాని పోర్ట్‌ బ్లెయిర్‌కు 215 కిలోమీటర్ల దూరంలో ఉందని సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపింది. ఆ తర్వాత ఉదయం 8.05 గంటలకు సైతం రిక్టర్‌ స్కేల్‌పై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత నుంచి మంగళవారం ఉదయం వరకు దాదాపు 11 సార్లు భూమి కంపించింది. ఇదిలా ఉండగా.. సోమవారం సాయంత్రం అండమాన్‌ దీవుల్లో రిక్టర్‌ స్కేల్‌పై 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. అలాగే దాదాపు 13సార్లు భూమి కంపించింది. వరుస భూకంపాలతో జనం భయాందోళనకు గురవుతున్నారు.

 

Tags: A series of earthquakes shaking the Andaman and Nicobar Islands

Leave A Reply

Your email address will not be published.