వరుస తప్పులతో కమలం స్టెప్పులు

Date:09/03/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
న‌రేంద్ర‌మోడీ గుజ‌రాత్ సీఎంగా.. చేసిన అభివృద్ధి మంత్ర‌మే.. గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన‌మంత్రిని చేయ‌గ‌లిగింది. టెక్నాల‌జీ వినియోగం.. మాట‌తీరుతో జ‌నాన్ని స‌మ్మోహ‌నం చేశారు. పైగా ప‌దేళ్ల‌పాటు కాంగ్రెస్ పార్టీపై ప్ర‌జా వ్య‌తిరేక‌త క‌లిసొచ్చింది. ప‌లు కుంభ‌కోణాలు కాంగ్రెస్ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌ను మూట‌గట్టేందుకు కార‌ణ‌మ‌య్యాయి. తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌లు.. విభ‌జ‌న‌తో ఒక‌రు.. కొత్త రాష్ట్రం ఏర్పాటుతో మ‌రొక‌రు ఛీ కొట్టారు. క‌నీసం డిపాజిట్లు కూడా ద‌క్క‌కుండా బుద్దిచెప్పిన ఘ‌న‌త ఏపీ జ‌ల‌కే ద‌క్కుతుంది. అదే ఏపీ ఇప్పుడు మ‌రోసారి హ‌స్తం పార్టీ హ‌వా పెరిగేందుకు ఆయుధంగా మార‌ట‌మే ఇక్క‌డ చ‌ర్చ‌నీయాంశం. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావ‌టానికి. కార‌ణాలేమైనా.. ప్ర‌జ‌లు చంద్ర‌బాబును న‌మ్మార‌నేది ఆఖ‌రి అంశం. అదే స‌మ‌యంలో మిత్ర‌ప‌క్ష బీజేపీపై బాబు కూడా ఆశ‌లు పెంచుకున్నారు. ప్ర‌త్యేక హోదా వ‌ద్దంటే.. ప‌ర్లేదు.. ప్యాక‌జీ చాలంటూ చంద్ర‌బాబు ఓకే అన్నారు. వ‌చ్చిన‌న్ని నిధులు తీసుకుంటే.. రాష్ట్ర ప్ర‌గ‌తికి బాట‌లు వేయ‌వ‌చ్చ‌నేది సీఎంగా చంద్ర‌బాబు ఆలోచ‌న‌. కానీ.. క‌మ‌లం పార్టీ అంత‌ర్ముఖాన్ని గుర్తించ‌లేక‌పోయారు. ఫ‌లితంగా నాలుగేళ్ల త‌రువాత‌.. పొత్తుకు పంగ‌నామాలు పెట్టి ఎంచ‌క్కా బీజేపీ చేతులు దులుపుకుంది. ఇక‌.. కాంగ్రెస్ నేత‌లు తామొస్తే.. హోదా ప‌క్కా అంటూ హామీలు గుప్పిస్తోంది. ఇదే స‌మ‌యంలో బీజేపీతో పోల్సితే హ‌స్తం ఉత్త‌మం అనే అభిప్రాయం ప్ర‌జ‌ల్లోకి చేర‌టం కూడా కాంగ్రెస్‌కు జ‌వ‌స‌త్వాలు వ‌స్తున్నాయ‌నేందుకు నిద‌ర్శ‌నం. ఈశాన్యం గెలుపుతో.. 21 రాష్ట్రాల్లో కాషాయ రెప‌రెప‌లు లెక్క తేలాయి.. మిగిలింది 8 మాత్ర‌మే.. అందుకేనేమో.. లెనిన్ నుంచి మ‌హాత్మ‌గాంధీ విగ్ర‌హాల వ‌ర‌కూ తొల‌గించేందుకు బీజేపీ శ్రేణులు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇది ప్ర‌జ‌ల్లోకి సానుకూల ఆలోచ‌న‌ల‌కు బ‌దులు వ్య‌తిరేక‌త‌కు కార‌ణ‌మ‌వుతున్నాయ‌ని గుర్తించిన నేత‌ల్లో ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు, ప్ర‌ధాని మోదీ ఉన్నారు. దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగినా క‌మ‌ల‌నాథులు మాట విన‌క‌పోవటంతో.. అధినేత‌ల‌కు చుక్క‌లు క‌నిపిస్తున‌నాయ‌ట‌. ఇటువంటి ప‌రిణామాల‌న్నింటినీ కాంగ్రెస్ త‌న‌కు అనుకూలంగా మ‌ల‌చుకోవాల‌నే ప్లాన్ లో ఉంది.. అదే జ‌రిగితే మూడో ఫ్రంట్ కంటే కూడా కాంగ్రెస్ బ‌ల‌మే ఎక్కువ‌నేది విశ్లేష‌కుల అంచ‌నా.
Tags: A series of gently sloping steps

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *