Natyam ad

పచ్చదండుకు పసుపుల బలిజల షాక్‌

– వైఎస్సార్‌సీపీలోకి వలసలు
– దేశం ఖాళీ

 

పుంగనూరుముచ్చట్లు:

Post Midle

తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్‌ నాయకుడు, మాజీ కౌన్సిలర్‌ పసుపుల కేశవమూర్తి, ఆయన సతీమణి, మాజీ కౌన్సిలర్‌ ఆనంతలక్ష్మీ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు సుమారు 70 మంది గురువారం మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. స్థానిక కౌన్సిలర్‌ రెడ్డెమ్మ, కిషోర్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు రాయల జగదీష్‌, ఎస్వీటి కిషోర్‌ల ఆధ్వర్యంలో పసుపుల కుటుంభాలకు చెందిన బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు పార్టీలో చేరడంతో తెలుగుదేశం షాక్‌కు గురైంది. పార్టీలో చేరిన వారికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. అలాగే నక్కబండకు చెందిన హైదర్‌ ఆధ్వర్యంలో 40 మంది ముస్లిం మహిళలతో సహా తెలుగుదేశం వదిలి వైఎస్సార్‌సీపీలో చేరారు. అలాగే మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర ఆధ్వర్యంలో కట్టక్రిందపాళ్యెంకు చెందిన మనోహర్‌, రెడ్డెప్ప, బాలు, శంకర, పవన్‌కళ్యాణ్‌తో పాటు 20 మంది తెలుగుదేశం నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. మంత్రి మాట్లాడుతూ కేశవమూర్తి కుటుంబం రావడంతో పార్టీ మరింత బలోపేతమైందన్నారు. ఆయనకు అన్ని విధాల పార్టీ సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. కేశవమూర్తి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 30 ఏళ్ల అభివృద్ధి ఐదేళ్లలో జరిగిందని తెలిపారు. ప్రభుత్వ విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ మాజీ మెంబరు పోకల అశోక్‌కుమార్‌, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, నియోజకవర్గ పరిశీలకుడు జింకా వెంకటాచలపతి, ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ ముత్తంశెట్టి విశ్వనాథ్‌, రాష్ట్రజానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, బలిజ సంఘ నాయకులు ప్రభాకర్‌, మల్లికార్జున , రమణ, హరీష్‌, రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.

Tags: A shock of yellow balls for green leaves

Post Midle