Natyam ad

సుప్రీం లో కవితకు షాక్

..
ఈడీ విచారణలపై స్టేకు నిరాకరణ

 

న్యూఢిల్లీ ముచ్చట్లు:

 

Post Midle

బీఆర్ఎస్ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.  తనకు ఇచ్చిన నోటీసులో ఇతరులతో కలిపి విచారిస్తామన్నారని, కానీ అలా చేయలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మొబైల్ సీజ్ చేశారని తెలిపారు. సీఆర్పీసీ 160 సెక్షన్ ప్రకారం మహిళను తన ఇంట్లోనే విచారించాలని, కానీ ఈడీ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం నాడు వాదనలు విన్న న్యాయస్థానం  మధ్యంతర రిలీఫ్ ఇచ్చేందుకు. ఈ పిటిషన్పై ఈనెల 24న విచారణ చేపడతామని చెప్పింది.
కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత గురువారం  మరోసారి ఈడీ ఎదుట హాజరుకానున్న విషయం తెలిసిందే. ఈనెల 11న ఈడీ అధికారులు ఆమెను 9 గంటలపాటు విచారించారు. 16న మళ్లీ విచారణకు హాజరుకావాలన్నారు. ఈనేపథ్యంలోనే ఆమె ఈడీ నోటీసులపై స్టే ఇవ్వాలని సుప్రీంను ఆశ్రయించగా.. నిరాశ ఎదురైంది.

Tags;A shock to Kavitha in Supreme

Post Midle