మున్సిపల్ స్పందనకు ఒకే ఒక్క అర్జీ
నంద్యాల ముచ్చట్లు:
నంద్యాల పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు స్పందన కార్యక్రమం అని అసిస్టెంట్ కమిషనర్ వెంకట దాస్ అన్నారు. మున్సిపల్ కార్యాలయం లో సోమవారంఆయన స్పందన కార్యక్రమాన్ని పట్టణ వాసుల నుంచి వినతుల కోసం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహించారు .. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ వెంకట దాస్ . మాట్లాడుతూస్పందనకు వచ్చిన వినతిపత్రాలను సిబ్బంది నేరుగా క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్దేశిత గడువులోపు పరిష్కరించేందుకే స్పందన కార్యక్రమం అని అన్నారు . పట్టణంలో ఎమైన సమస్యలు ఉంటే స్పందనలోవినతిపత్రాలను ఇచ్చి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు . ఈ రోజు జరిగిన స్పందనకు నీటి పైపు లైన్ కావాలని ఓకే ఒక్క అర్జీ ఇచ్చారని ఆయన అన్నారు . ఈ కార్యక్రమంలో ఆర్ ఓ. వరప్రసాద్ . సీనియర్ అసిస్టెంట్ వర్రా మద్దిలేటి. మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags: A single application for municipal response

