పది ఎర్రచందనం దుంగలతో ఒక స్మగ్లర్ అరెస్ట్ – టయోటా కారు స్వాధీనం

చిత్తూరు  ముచ్చట్లు:

రేణిగుంట సమీపంలోని ఆంజనేయ పురం చెక్ పోస్ట్  చైతన్య పురం వద్ద  ఒక టయోటా కారు లో 10 ఎర్రచందనం దుంగలు రవాణా చేస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కారును స్వాధీనం చేసుకుని, కారు నడుపుతున్న స్మగ్లర్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం రేంజ్ డీఐజీ కాంతి రాణా టాటా ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్ ఆధ్వర్యంలో కోడూరు సబ్ కంట్రోల్ టాస్క్ ఫోర్స్ ఆర్ ఐ కృపానంద, ఆర్ ఎస్ ఐ పి.లక్ష్మ న్  బృందం శనివారం తెల్లవారుజామున రేణిగుంట కోడూరు రోడ్డులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.  మూడు గంటల సమయం లో కారు అనుమానాస్పదంతో కనిపించడం తో ఆపే ప్రయత్నం చేయగా, కారును ముందుకు ఉరుకించాడు. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు కారుకు అడ్డం పడి ఆపగలిగారు. కారులో తనిఖీ చేయగా. అందులో పది ఎర్రచందనం దుంగలను కనుగొన్నారు.  డ్రైవర్ గా వ్యవహరిస్తున్న ఏర్పేడు మండలం అంజమేడు కు చెందిన వేణుగోపాల్ (24) అనే స్మగ్లర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇతను బెంగుళూరుకు చెందిన ఇమ్రాన్ అనే స్మగ్లర్ కు చేరవేయడానికి రవాణా చేస్తున్నట్లు విచారణ లో తెలిపారు. డీఎస్పీ మురళీధర్ మాట్లాడుతూ విచారణ లో స్మగ్లింగ్ తో సంబంధం ఉన్న వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కేసు ను సి ఐ వెంకట రవి నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:A smuggler arrested with ten red sandalwood logs
– Toyota car seized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *