Natyam ad

ఉరి వేసుకుని సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

మదనపల్లె ముచ్చట్లు:

ఉరి వేసుకుని సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన మదనపల్లిలో శనివారం రాత్రి కలకలం రేపింది. తాలూకా సిఐ శేఖర్, ఎస్సై వెంకటేష్ కథనం మేరకు.. స్థానిక ఈశ్వరమ్మ కాలనీలో ఉంటున్న తుపాకుల శ్రీరాములు ఒక్కగానొక్క కొడుకు తుపాకుల కిషోర్ (28) బెంగళూరు లోని టిసిఎస్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కంపెనీలో సాలరీ తగ్గించారని శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చాడు. మనస్థాపంతో శనివారం రాత్రి ఫ్యాన్ కు తోబుట్టువు చున్నీతో ఉరి వేసుకున్నాడు. తల్లిదండ్రులు ఆలస్యంగా గుర్తించేలోపే అతను బలవన్మరణం చెందాడు. ఇదివరకే ప్రేమ వివాహం జరిగి విడిపోయినట్లు సమాచారం. ఘటన సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

 

Post Midle

Tags: A software employee committed suicide by hanging himself

Post Midle