శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా పార్వేట ఉత్సవం
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం సాయంత్రం పార్వేట ఉత్సవం ఏకాంతంగా జరిగింది. ప్రతి ఏడాదీ కనుమ పండుగనాడు పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ.ఇందులో భాగంగా మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారిని, శ్రీ కృష్ణ స్వామివారిని ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఊరేగించి, కల్యాణమండపంలో ఆస్థానం నిర్వహించారు.ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలు, హరికథ పారాయణం నిర్వహించారు. టిటిడి గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో అడవిలో ఉండే విధంగా పులులు ఇతర క్రూర జంతువుల సెట్టింగ్ లు ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు మూడు సార్లు స్వామి వారి తరపున ఈటెను విసిరి పార్వేట ఉత్సవం నిర్వహించారు.
అనంతరం స్వామివారు తిరిగి ఆలయానికి చేరుకున్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: A solitary Parvati festival at the Srivari Temple