శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏకాంతంగా పార్వేట ఉత్సవం
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో సోమవారం సాయంత్రం పార్వేట ఉత్సవం ఏకాంతంగా జరిగింది. ప్రతి ఏడాది కనుమ పండుగ మరునాడు పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ.ఈ సందర్భంగా సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని, శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయంలోని విమాన ప్రాకారంలో ఊరేగించి, కల్యాణమండపంలో ఆస్థానం నిర్వహించారు. అనంతరం తిరిగి ఆలయానికి చేరుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో రాజేంద్రుడు, ఏఈవో రవికుమార్ రెడ్డి, ప్రధాన అర్చకులు శ్రీనివాస దీక్షితులు, సూపరింటెండెంట్ నారాయణ, టెంపుల్ ఇన్సెక్టర్ కామరాజు పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: A solitary Parvati festival at the temple of Sri Govindarajaswamy