30 సంవత్సరాల దారి సమస్యకు పరిష్కారం
రామసముద్రం ముచ్చట్లు:
రామసముద్రం మండలం మినికి పంచాయతీ గుంతలవారిపల్లి కి చెందిన గ్రామస్థులకు 30 సంవత్సరాలుగా దారి సమస్య ఉండేది. ఈ విషయంపై గతంలో రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డికి ప్రజలు వివరించారు. వారి సూచనలు మేరకు మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ భాష వైకాపా రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి జెడ్పిటిసి సిహెచ్ రామచంద్రారెడ్డి సింగల్ విండో అధ్యక్షులు శ్రీనాథ్ రెడ్డి పుంగనూరు మార్కెట్ కమిటీ అధ్యక్షులు అమర్నాథరెడ్డిలు గ్రామాన్ని సందర్శించి సమస్య పరిష్కరించారు. అలాగే రామసముద్రం మండలంలోని రాగిమాకుల పల్లె పంచాయతికి చెందిన ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తు నీళ్లలో పడి మరణించారు. వీరికి ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున రెండు చెక్కలను ఆ పిల్లల తల్లిదండ్రులకు అందజేశారు.

Tags; A solution to the 30-year road problem
