Natyam ad

చెడు వ్యసనాలకు బానిసైన కుమారుడు హత్య

* తండ్రి, మరో ఇద్దరు అరెస్ట్
* మదనపల్లె రెండవ పట్టణ సీఐ‌ మురళీకృష్ణ వెల్లడి

మదనపల్లె ముచ్చట్లు:

Post Midle

చదువు కోవడానికి కళాశాలకు వెళ్ళకుండా.. నిత్యం మద్యం సేవించడం, డ్రగ్స్ బానిసై జులాయిగా తిరుగుతూ.. డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధిస్తున్న కుమారుడిని ఆగడాలు చూడలేక, మందలించినా ఫలితం లేక.. ఏకంగా తండ్రి, మరో ఇద్దరి సహకారంతో హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు శనివారం నిందితులను అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లా‌ మదనపల్లె రెండవ పట్టణ సీఐ మురళీకృష్ణ హత్యకేసుకు‌ సంబంధించిన వివరాలను మీడియా ‌సమావేశంలో వెల్లడించారు. తంబళ్లపల్లె మండలం గోపిదిన్నె పంచాయతీ‌ కుతికిబండతండాకు చెందిన రెడ్డెప్పనాయక్ కుమారుడు ఠాగూర్ నాయక్ మదనపల్లె పట్టణంలో చదువు కుంటున్నాడు. రోజు తంబళ్లపల్లె నుంచీ‌ మదనపల్లెకు వచ్చిపోయే వాడు. తల్లిదండ్రులు ఇచ్చిన సొమ్ములతో మదనపల్లెకు వస్తున్న ఠాగూర్ నాయక్ డ్రగ్స్, మద్యానికి బానిసైయ్యాడు. వీటిపై తల్లిదండ్రులు పలుమార్లు మందలించినా.. ఫలితం లేకపోయింది. ‌

 

 

 

దీంతో కుమారుడిని హతమార్చేందుకు తండ్రి రెడ్డెప్పనాయక్ పథకం వేశాడు. ఇందుకు సంబేపల్లి మండలం శెట్టిపల్లి పంచాయతీ, పెద్దబిడికితండా గ్రామానికి చెందిన బావమర్ధి బుక్కే ప్రతాప్‌నాయక్, బెంగుళూరు విమానాశ్రయంలో సెక్యూరిటీ గార్డుగా విధులు‌ నిర్వహిస్తూ.. పెద్దమండ్యం మండలం నత్తిఓబన్నగారిపల్లికు చెందిన బుక్కే శేఖర్‌నాయక్‌లతో హత్యకు కుట్రపన్నారు. ఇందుకు రూ.2లక్షల సుఫారీ ఒప్పందంతో ముందుగా రూ.50వేలు తీసుకున్నారు. పథకం ప్రకారం జూన్ 28న మదనపల్లెకు వచ్చి‌న ఠాగూర్‌నాయక్‌ను మద్యం సేవించడానికి ప్రతాప్‌నాయక్, శేఖర్‌నాయక్ పిలుచుకుని పట్టణ శివారుప్రాంతం బీకేపల్లి ఇందిరమ్మ కాలనీకి వెళ్ళారు. ఫ్లూటుగా మద్యం సేవించిన ఠాగూర్ ‌నాయక్‌ను పథకం ప్రకారం హత్య చేసారు. జూలై 2న ఆ ప్రాంతంలో దుర్వాసన వస్తుండగా గమనించిన స్థానికులు మదనపల్లె రెండవ పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీఐ మురళీకృష్ణ సెల్‌ఫోన్ సాంకేతిక పరిజ్ఞానంతో శుక్రవారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో తండ్రి, ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుంచీ మూడు సెల్‌ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు సీఐ మురళీకృష్ణ వెల్లడించారు.

 

Tags: A son addicted to bad habits is murdered

Post Midle

Leave A Reply

Your email address will not be published.