Natyam ad

నల్గోండలో  తల్లిని వదిలేసిన కొడుకు

నల్గోండ ముచ్చట్లు:

 

నవమాసాలు మోసి కని పెంచి కంటికి రెప్పలా చూసుకున్న తల్లినే వదిలించుకోవాలనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. వృద్ధురాలైన అమ్మ అనారోగ్యంతో బాధ పడుతుండగా బతికుండగానే శ్మశానంలో వదిలేశాడు. నల్గొండ జిల్లాలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 3 రోజుల క్రితం తల్లిని శ్మశానంలో వదిలేయగా, సోమవారం గ్రామస్థులు గుర్తించి, ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వృద్ధురాలికి అల్పాహారం అందించి, అక్కడే షెడ్డులో తాత్కాలికంగా నివాసం ఏర్పాటు చేశారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఏపీలోని పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం ఎర్రావులపాడు గ్రామానికి చెందిన వెంకటరత్నమ్మ(70)కు కుమారుడు వెంకటేశ్, ఓ కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా వెంకటరత్నమ్మ అనారోగ్యంతో బాధ పడుతుండగా, కొడుకు వెంకటేశ్ తల్లిని వదిలించుకోవాలనుకున్నాడు. దీంతో శనివారం కొడుకు, కోడలు కలిసి వృద్ధురాలి చేయి విరగ్గొట్టి, నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ మండలం వాటర్ ట్యాంక్ తండా వద్ద శ్మశాన వాటిక వద్ద వదిలేసి వెళ్లారు. 3 రోజులుగా ఆ వృద్ధురాలు అలానే పడి ఉంది. సోమవారం పంచాయతీ కార్మికుడు విధి నిర్వహణలో భాగంగా మొక్కలకు నీరు వేసేందుకు అక్కడికి వెళ్లగా, కొన ఊపిరితో ఉన్న వృద్ధురాలిని గుర్తించి సర్పంచ్ కు సమాచారం అందించాడు. ఆయన వెంటనే అక్కడకు చేరుకుని బాధితురాలికి అల్పాహారం అందించి, అక్కడే ఓ షెడ్డు ఏర్పాటు చేశారు.విషయాన్ని పోలీసులకు తెలపగా, వారు వచ్చి వృద్ధురాలిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆమె బ్యాగులోని ఆధార్, రేషన్ కార్డు ద్వారా వివరాలు సేకరించారు. ఈ సమాచారాన్ని దాచేపల్లి పోలీసులకు తెలిపామని పేర్కొన్నారు. వృద్ధురాలి భర్త బతికే ఉన్నాడని ఆయన పేరు ఏడుకొండలని పోలీసులు తెలిపారు. పోలీసులు బాధితురాలి వద్ద నుంచి వివరాలు సేకరించారు. ఈ క్రమంలో ఇంటికి వెళ్తే తమ కుమారుడు, కోడలు తనను చంపేస్తారని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఆస్పత్రికి తీసుకెళ్లాలని కన్నీటి పర్యంతమైంది. దీంతో ఆమెకు వైద్య సహాయం అందించిన పోలీసులు వివరాలను ఏపీ పోలీసులకు అందజేశారు.

 

Tags: A son who abandoned his mother in Nalgonda

Post Midle
Post Midle