Natyam ad

దళిత రత్నకు ఆత్మీయ సత్కారం

కమాన్ పూర్ ముచ్చట్లు:

దళిత రత్న దేవి లక్ష్మీ నరసయ్య పలువురు ఘనంగా సన్మానించారు.గోదావరిఖని వీరాంజనేయ హమాలి సంఘం గౌరవ అధ్యక్షులు పాతిపల్లె ఎల్లయ్య చేతుల మీదుగా తెలంగాణ ఉద్యమ నేత పోలీస్ కానిస్టేబుల్ దళిత రత్న దేవి లక్ష్మీ నరసయ్య ఘనంగా అభినందించి ఆత్మీయ సత్కార సన్మానం చేయడం జరిగింది పాతపల్లి ఎల్లయ్య  మాట్లాడుతూ దేవీ లక్ష్మీ నరసయ్య జీవితం వడ్డించిన విస్తరి అని అలాగే తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించాడని తన కు ఇష్టమైన పోలీస్ ఉద్యోగాన్ని త్యాగం చేశాడని అలాగే గోదావరిఖని వన్ టౌన్ లో విధులు నిర్వహిస్తున్నప్పుడు చాలామందితో ఆప్యాయంగా అనురాగంతో ఉండి పేద ప్రజలు పోలీస్ స్టేషన్కు వస్తే వారికి తగిన విధంగా సహాయం చేసేవాడని తాను సామాజిక సేవలు చేస్తూ గతంలో స్వచ్ఛందంగా రక్తదానాలు మరియు పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ శిక్షణలు ఇవ్వడంతో పాటు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో బోధించు సవీకరించు పోరాడు అనే ఆయుధంతో ముందుకెళ్లి చాలామంది దళిత బహుజనుల కు అండగా నిలిచాడని తన యొక్క జీవితం మన ముందు ఇంకా మంచి పేరు రావాలని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటూ

 

 

 

మా వీరాంజనేయ హమాలీ సంఘం తరఫున ఘనంగా సన్మానించామని తెలిపారు దళిత రత్న దేవి లక్ష్మీనరసయ్య సన్మాన గ్రహీత మాట్లాడుతూ గౌరవ సర్పంచులు ఎంపీటీసీలు కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు వివిధ మహిళా సంఘాలు స్వచ్ఛంద సంఘాలు సినీ హీరోల ఫ్యాన్స్ అసోసియేషన్ సంఘాలు బ్యూరోక్రాట్లు జర్నలిస్టులు ప్రతి ఒక్క విభాగంలోని వారు నాకు సన్మానం చేస్తున్న క్రమంలో హమాలీ సంఘం నుంచి చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని తన వంతు సహకారం కచ్చితంగా ఉంటుందని నా యొక్క పోలీస్ ఉద్యోగంలో ఉన్నప్పుడు సహకరించిన విధంగానే ఇప్పుడు కూడా మీ అందరి సహకారం నాకు అవసరమని నేను కూడా మీ అందరికీ ఎల్లవేళలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో సపోర్టుగా ఉంటానని బాబాసాహెబ్ కార్మికుల కోసం ఆనాడే రాజ్యాంగంలో పొందుపరిచాడని తెలిపాడు ఇంకా ఈ కార్యక్రమంలో కొమ్ము కుమారస్వామి బడిపల్లి మహేందర్ పున్నమి కిషన్ చొప్పరి రాజమల్లు పైడిపల్లి కొమురయ్య జంగా రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: A soulful tribute to Dalit Ratna

Post Midle