ఆకాశ‌గంగా శ్రీ బాలాంజ‌నేయ‌స్వామి ఆల‌యంలో వైభవంగా క‌న‌కాంబ‌రం పుష్పాల‌తో విశేష‌ అభిషేకం

తిరుమ‌ల‌ ముచ్చట్లు:

తిరుమ‌ల‌లో హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీ ఆంజ‌నేయ‌స్వామి జ‌న్మ స్థ‌ల‌మైన ఆకాశ‌గంగ‌లో శ్రీ అంజ‌నాదేవి స‌మేత శ్రీబాలాంజ‌నేయ‌స్వామివారి ఆల‌యంలో సోమ‌వారం ఉద‌యం స్వామివారికి ఎంతో ప్రీతి పాత్ర‌మైన‌ క‌న‌కాంబ‌రం, సింధూర వ‌ర్ణ‌ గ‌న్నేరి పుష్పాల‌తో విశేష సహస్ర నామార్చనను అర్చకులు నిర్వహించారు.ఈ సందర్భంగా టీటీడీ వైఖాన‌స ఆగ‌మ‌స‌ల‌హాదారు శ్రీ మోహ‌న‌రంగాచార్యులు ఆంజ‌నాద్రి, ఆకాశగంగ శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారి జ‌న్మ‌స్థ‌లం మ‌రియు స్వామివారి వైభ‌వం గురించి వివరించారు. అనంతరం స్వామివారికి పంచామృత స్న‌ప‌న తిరుమంజ‌నం జరిగింది.ఈ కార్య‌క్ర‌మాల్లో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

 

Tags:A special abhishekam with magnificent Kanakambaram flowers at Akashaganga Sri Balanjaneyaswamy Temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *