Natyam ad

పుంగనూరులో లారీ ఓనర్ల సంఘానికి , డ్రైవర్లకు ప్రత్యేక కాలనీ – మంత్రి పెద్దిరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

లారీ ఓనర్ల అసోసియేషన్‌కు , డ్రైవర్ల సంఘానికి భీమా సౌకర్యంతో పాటు 3 ఎకరాల స్థలంలో ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేయిస్తామని రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం డ్రైవర్ల అసోషియేషన్‌ సంఘ నాయకుడు సిద్దిక్‌ ఆధ్వర్యంలో 200 మంది డ్రైవర్లకు భీమా సర్టిఫికె ట్లను పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ చెర్లోపల్లి వద్ద ఆటో వెహోబైల్‌ వారికి కూడ 5 ఎకరాల స్థలం కేటాయించి,గృహాలు నిర్మిస్తామన్నారు. అలాగే వైఎస్సార్‌సీపీ పార్టీ ఆఫీసుకు కూడ స్థలం ఏర్పాటు చేశామని, త్వరలోనే కార్యాలయం నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము, సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, అంజుమన్‌ కమిటి అధ్యక్షుడు ఎంఎస్‌.సలీం, మాజీ అధ్యక్షుడు షా తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: A special colony for lorry owners association and drivers in Punganur – Minister Peddireddy

 

Post Midle