Natyam ad

ప్రజలకు ప్రభుత్వానికి వారధులైన వాలంటీర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు

రాష్ట్ర సంక్షేమ సారథులు వాలంటీర్లే..

రాష్ట్ర వ్యాప్తంగా 243 కోట్లతో.. 2.33 లక్షల వాలంటీర్లకునగదు పురస్కారాలు

లంచాలు, వివక్ష లేని వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబుకు కడుపుమంట

Post Midle

వాలంటీర్లు సత్కాల సభలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

 

విజయవాడ ముచ్చట్లు:

వాలంటర్లే రాష్ట్రానికి నిజమైన సంక్షేమ సారథులు.. ప్రభుత్వుం తలచిన మంచిని ప్రతి గడపకు వాస్తవ రూపంలో తీసుకెళ్లి ఆప్యాయంగా లబ్ధిదారులకు చేరుస్తున్న వాలంటీర్లకు నా సంపూర్ణ మద్ధతు. లంచాలు, వివక్ష లేని వాలంటీర్ వ్యవస్థ గత టీడీపీ ప్రభుత్వంలోని జన్మభూమి కమిటీల గంజాయి వనం స్థానంలో ఎదిగిన ఓ తులసి వనం. ప్రజలకు మంచి చేయడం కోసం అడుగులు వేస్తున్న వాలంటీర్లే ఈ జగన్ సైన్యమని గర్వంగా చెబుతున్నా.. సీఎం జగన్ఒకటో తేదీన సర్యోదయానికి ముందే వృద్ధుల గడపకు పెన్షన్ కానుక ఇవ్వడంతో పాటు ప్రతి ప్రభుత్వ పథకాన్ని లంచాలు, వివక్ష లేకుండా లబ్ధిదారులకు చేరుస్తూ వారి కళ్లలో ఆనందం నింపుతున్న వాలంటీర్ల సేవలు అద్భుతమని సీఎం జగన్ కొనియాడారు. ప్రభుత్వాన్ని ప్రజల గడప వద్దకు చేర్చి నిజమైన ప్రజా సేవ చేస్తున్న వాలంటీర్లు కేవలం సేవకులు కాదని స్వచ్ఛంద సైనికులని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారుధులుగా ఉన్న ఈ వాలంటీర్ సైన్యం ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న మంచిని చెప్పాలని కోరారు.

 

 

 

గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో జరిగిన దోపిడీ.. నేడు ఎవరి సహకారం లేకుండా ప్రజలకు అందుతున్న సంక్షేమ లబ్ధికి మధ్య తేడాను వివరించాలని సూచించారు. జగన్ పెట్టుకున్న నమ్మకమే వలంటీర్లు అంటూ సీఎం జగన్ పేర్కొన్నారు. వరుసగా మూడో ఏడాది అద్భుత సేవలు అందించిన వాలంటీర్లను సత్కరించే వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని సీఎం జగన్‌ విజయవాడలోని ఏ 1 కన్వెన్షన్ వేదికగా ప్రారంభించారు. ప్రజలకు వలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వారికి వందనం చెబుతూ వరు­సగా మూడో ఏడాది గ్రామ, వార్డు సచివాల­యాల పరిధిలో సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు సీఎం జగన్‌ పేర్కొన్నారు. అనంతరం ఉత్తమ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాలు అందించి సత్కరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రజలకు మంచి చేస్తున్న వలంటీర్ వ్యవస్థను చూస్తుంటే చంద్రబాబు అండ్ కో, ఎల్లో మీడియాకు తీవ్రమైన కడుపు మంట వస్తోందని విమర్శించారు. ఆజ్మోలా ట్యాబ్లెట్ వేసినా కూడా ఈ కడుపు మంట తగ్గదని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఎంత సేపూ తన దోపిడీ జన్మభూమి కమిటీలపైనే చూపంతా ఉంటుందని విమర్శించారు. దీనికి తోడు ప్రజలకు మంచి చేస్తున్న వాలంటీర్లను అల్లరి మూకలు అంటూ అవమానించేందుకు బుద్ధాండాలంటూ ఫైర్ అయ్యారు.

 

 

 

వాలంటీర్ వ్యవస్థే జగన్ మహా సైన్యం..

ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వానికి ప్రతి ఒక్క విషయంలోనూ తోడుగా నిలుస్తున్న వాలంటీర్ వ్యవస్థే తన మహా సైన్యమని సీఎం జగన్ పేర్కొన్నారు. ఒకటో తేదీన ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ ఇచ్చే మన లాంటి వాలంటీర్ వ్యవస్థను ఎక్కడైనా చూశామా.. అని సీఎం జగన్ ప్రశ్నించారు. జన్మభూమి కమిటీలు అరాచకాలు, వివక్షలు ఇక రాష్ర్టంలో ఉండరాదనే లక్ష్యంతోనే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. తులసి వనం లాంటి వాలంటీర్ వ్యవస్థను మరింత ప్రతిష్టాత్మకంగా మార్చ గలిగే శక్తి మీకే ఉందన్నారు. మనందరి ప్రభుత్వంలో పేదలకు చేసిన ప్రతి ఒక్క మంచి కూడా మీ చేతుల మీదుగా మీ ద్వారానే జరిగింది కాబట్టి వాలంటీర్లకు తాము ప్రజా సేవకులమని చెప్పుకునే హక్కు ఉందన్నారు. ఈ ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన మంచిని, నిజాన్ని ప్రజలకు చెప్పే బాధ్యత కూడా వలంటీర్లు భుజాలపై ఉందన్నారు. మన ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ పథకమైనా వలంటీర్ల చేతల మీదుగానే అందిస్తున్నామని, పెన్షన్ మొదలు.. రేషన్ కార్డుల వరకు ఏదైనా వలంటీర్ల ద్వారానే ప్రజలకు అందుతోందని సీఎం జగన్ గుర్తు చేశారు.

 

 

 

నిజాలు చెప్పాల్సిన సత్య సారథులు వాలంటీర్లే..

ప్రతి గడప వద్ద ప్రభుత్వ పథకమంటే లంచాలకు తావివ్వకుండా, వివక్ష లేకుండా కనిపించేవాళ్లే వాలంటీర్లని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇంత మంచి జరుగుతున్నా నవరత్నాల పాలనలో 2.10 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి చేర్చినా ఎల్లో మీడియాను చంద్రబాబు అండ్ కో అబద్ధాలు, అసత్య ప్రచారాలు మానడం లేదని విమర్శించారు. నాన్ డీబీటీతో కూడా కలుపుకుంటే మొత్తంగా మూడు లక్షల కోట్లు నేరుగా ప్రజలకు మంచి చేశామని చంద్రబాబు తన జీవిత కాలంలో ఏనాడైనా ప్రజలకు ఇంత మంచి చేసే పాలన చేశారా అని ప్రశ్నించారు. దీంతో కడుపుమంటతో ఓర్వలేక అబద్దాలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి అన్యాయమైన రాజకీయాలతో మనం పోరాడుతున్నామని. మన పేదల ప్రభుత్వంపై పెత్తందారీల దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని గుర్తించాలన్నారు. ఈ తరుణంలో ప్రతి గడపకు వెళ్లి నిజం చెప్పగలిగిన సత్యసారథులు వాలంటీర్లే అన్నారు. మన ప్రభుత్వ బలం నేరుగా ప్రతి గడపకూ వెళ్లే వలంటీర్లే అన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫిలాసపీ, నవరత్నాల పాలసీకి ప్రతి రూపంగా నేడు వాలంటర్లు నిలిచినందకు గర్వంగా ఉందన్నారు.

 

 

 

ఈ ప్రభుత్వంలో వాలంటీర్లు చేస్తోంది ఒక సేవ అని ఇక్కడ మిమ్మల్ని పలానా పని చేయకూడదు అంటే గట్టిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు, లక్ష్యాలు, సేవల కోసం దన్నుగా నిలబడుతున్న వ్యవస్థే వలంటీర్లు అన్నారు. సేవా భావంతో తీసుకున్న వాలంటీర్ల పోస్టు మీ అభ్యుదయ భావాలు, రాజకీయ స్వేచ్ఛకు ఎలాంటి అడ్డంకి కారాదన్నారు. వాలంటీర్లను లీడర్లుగా చేస్తానని మొదటి సమావేశంలోనే తాను చెప్పానని ఖచ్చితంగా అది జరిగి తీరుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు మీరేనని, ప్రజలకు మరింత మంచి చేసేందుకు అండగా నిలవాలని కోరారు.

 

 

 

వాలంటీర్ వ్యవస్థపై దుష్టచతుష్టయం కక్ష..

వాలంటీర్లు ఇంత మంచి చేస్తున్నా విమర్శలు గుప్పిస్తున్న దుర్మార్గంగా మాట్లాడుతున్న చంద్రబాబు అండ్ కో, దుష్టచతుష్టయం చూస్తే వీళ్లు మనుషులేనా అని అనిపిస్తుందని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యోదయానికి ముందే ఇంటికి ముసలి వాళ్లకు పెన్షన్ ఇచ్చి చిరునవ్వుతో వెళుతుంటే వెటకారం చేస్తూ తెల్లవారుజామునే తలుపులు తడుతున్నారని విద్వేశాలు ఆపాదిస్తున్న టీడీపీని మరచిపోరాదని గుర్తు చేశారు. మాజీ సీఎం చంద్రబాబు ఏకంగా వాలంటీర్లను చులకన చేసేలా మద్యం తాగి ఇళ్లకు వెళతారని, అల్లరి మూకలని అపహాస్యం చేశారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను తీసేసి జన్మభూమి కమిటీలు తెస్తామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇన్ని దుష్ట కోణాల మధ్య నమ్ముకున్నది దేవుడి దయ ప్రజల ఆశీస్సులు, వలంటీర్ల తోడ్పాటే అని సీఎం జగన్ పేర్కొన్నారు.

 

 

వలంటీర్లకు వందనం కార్యక్రమం సాగేదిలా..

మూడో ఏడాది వలంటీర్లకు వందనం కార్యక్రమం కింద సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులతో రాష్ర్ట వ్యప్తంగా 10 రోజుల పాటు వలంటీర్లను సత్కరిస్తుంది. సేవా మిత్ర అవార్డు కింద రూ. 10 వేలు నగదు బహుమతి సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జితో స్కరించనున్నారు. ఈ విభాగం కింద రాష్ర్ట వ్యాప్తంగా ఈ ఏడాదిలో ఎటువంటి ఫిర్యాదులు వివాదాలు లేకుండా పనిచేసిన 2,28624 మందికి నిలిచారు. సేవా రత్న అవార్డు కింద రూ. 20 వేల నగదు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్ మెడల్ అందించనున్నారు. ఈ విభాగం కింద ప్రతి మండలం లేదా మున్సిపాలి పరిధిలో 5 మంది చొప్పున మున్సిపల్ కార్పొరేషన్లలో 10 మంది చొప్పున ఉత్తమ వాలంటీర్లగా పనిచేసిన 4220 మంది నిలిచారు. సేవా వజ్ర అవార్డు కింద రూ. 30 వేల నగదు సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్ అందించనున్నారు. ఈ విభాగం కింద 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి 5 మంది వలంటీర్లు అనగా మొత్తం 875 మంది నిలిచారు.

 

Tags:A special thanks to the volunteers who are the bridge to the government to the people

Post Midle