Natyam ad

విద్యార్దినికి పాము కాటు

ఖమ్మం ముచ్చట్లు:


ఖమ్మం జిల్లా వైరాలోని రాష్ట్ర సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో రాత్రి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థినీ కొంగల ప్రసన్న పాము కాటుకు గురైంది. డైనింగ్ హాల్లో భోజనం చేసి వసతి భవనం వద్దకు వెళ్తున్న సమయంలో ప్రసన్నను పాము కాటు వేసింది. వెంటనే అక్కడ ఉన్న ఉపాధ్యాయినీలకు పాటు కాటు వేసిన విషయాన్ని తెలిపింది. హుటాహుటిన వైరాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. ఆనంతరం మెరుగైన వైద్యం కోసం తల్లాడ 108 వాహనంలో ఖమ్మం తరలించారు. ప్రస్తుతం ప్రసన్న ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.

 

Tags: A student was bitten by a snake

Post Midle
Post Midle