-ఎంపీ ఆరవింద్
Date:23/01/2021
నిజామాబాద్ ముచ్చట్లు:
గత ఎన్నికల్లో పార్లమెంట్ కు పోటీ చేసిన అభ్యర్థులతో ఎంపీ అరవింద్ సమావేశం అయ్యారు. ఈ సమావేశం లో రైతులకు ఎంపీ అరవింద్ కు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. రైతులకు కచ్చితంగా మద్దతు ధర, పసుపు బోర్డ్ కావాలని రైతులు డిమాండ్ చేసారు. ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ నేను ఎంపీ అయ్యాక ఐదుగురు రైతులతో అధికారులతో సమావేశం ఏర్పాటు చేశాను. అధికారుల బృందం నిజామాబాద్ జిల్లాకు వచ్చి రైతులతో మాట్లాడింది. నా అభిప్రాయం కూడా తీసుకున్నారు. పసుపు సమస్యపై సమగ్ర వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత స్పైస్ బోర్డు ప్రాంతీయ విస్తరణ కార్యాలయం నిజామాబాద్ లో ఏర్పాటైంది. ఇవన్నీ ఎంపీ అయ్యాక తొమ్మిది నెలల్లోనే పూర్తయ్యాయి. 30వేల టన్నుల పసుపు దిగుమతి అయ్యేది… దీనిపై నిషేధం విధించారు. గత అక్టోబర్ నుంచి దేశంలోకి పసుపు దిగుమతి పూర్తిగా ఆగిపోయింది. ఆన్ లైన్ ట్రేడింగ్ నుంచి పసుపు తొలగించే చర్యలు మొదలయ్యాయని అన్నారు.
2021లో ఐదు నెలల కాలంలో 99వేల టన్నుల పసుపు మన దేశం నుండి ఎగుమతి అయ్యింది ఇందులో పది వేల టన్నులు నిజామాబాద్ నుంచి బంగ్లాదేశ్ కు ఎగుమతి అయ్యింది. గత ఏడాది వరకు కేవలం 69వేల టన్నులు మాత్రమే ఎగుమతి అయ్యేది. అమెరికాలో కిలో సేంద్రియ పసుపు ఆరున్నర వేలు అమ్ముడవుతోందని అన్నారు.పసుపు పంటకు రూ.15వేల మద్దతు ధర సాధ్యమే. సేంద్రియ పసుపు సాగు చేస్తే రూ.15వేలకు మించి ధర లభిస్తుందని అన్నారు.
పుంగనూరులో 23న జాబ్‌మేళాను ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి
Tags:A support price of Rs 15,000 is possible for the yellow crop