Natyam ad

గుజరాత్ లో త్రిముఖ పోటీ

గాంధీనగర్ ముచ్చట్లు:


ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఎన్నికల సందడి మొదలైంది. డిసెంబర్ లో రెండు విడతల్లో 182 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. కొన్నేళ్లుగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాత్రమే ఉన్న పోటీలోకి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంటర్ అయింది. దీంతో గుజరాత్ లో త్రిముఖ పోటీ నెలకొంది. ఢిల్లీ తర్వాత పంజాబ్ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంచలనం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ లోనూ చరిత్ర సృష్టించబోతుందా, కమలం పార్టీని గట్టిగా ఢీకొట్టబోతుందా అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ దూకూడుతో కాంగ్రెస్ పార్టీ సైతం ఆందోళన చెందుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. గత 25 సంవత్సరాలుగా గుజరాత్ ను పాలిస్తున్న బీజేపీ.. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. పార్టీలో సమూల మార్పులు, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో ఈ సారి గుజరాత్ ను హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ యోచిస్తుంటే.. ప్రధాని సొంత రాష్ట్రంలో సత్తా చాటి వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించే ప్లాన్ తో ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకెళ్తోంది.

 

 

 

గుజరాత్ ఎన్నికల్లో గెలుపు కోసం ఎవరి వ్యూహలకు వారు పదును పెడుతున్నారు. సుదీర్ఘ కాలంగా గుజరాత్ లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే చాలా కాలం పోటీ సాగింది. ఇప్పటివరకు గుజరాత్ లో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, లేదంటే బీజేపీ ప్రభుత్వం మధ్యలో జనతా పార్టీ, జనతా దళ్, రాష్ట్రీయ జనతా దళ్ పార్టీలకు చెందిన వ్యక్తులు ముఖ్యమంత్రులుగా పనిచేసినా, స్వల్ప కాలం మాత్రమే వారు పదవిలో ఉన్నారు. 2017 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, వర్సెస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ జరిగింది. ఇప్పుడు గుజరాత్ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఆమ్ ఆద్మీ పార్టీ మారింది. గుజరాత్ కురుక్షేత్రంలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతున్నాయి.ఢిల్లీ తర్వాత పంజాబ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ప్రస్తుతం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లో పోటీచేస్తున్నప్పటికి ప్రధాన ఫోకస్ మాత్రం గుజరాత్ పైనే పెట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇటీవల కాలంలో ప్రతి నెలలో వీలైనన్ని ఎక్కువ సార్లు ఢిల్లీ సీఏం అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ లో పర్యటిస్తూ..

 

 

 

Post Midle

ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్న వర్గాలను తమ పార్టీ వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. గుజరాత్ లో బీజేపీకి సంప్రాదాయ ఓటు బ్యాంకు ఉంది. అలాగే కాంగ్రెస్ కు కూడా క్షేత్రస్థాయి బలం ఉంది. గత కొన్నేళ్లుగా హస్తం పార్టీ బలహీనపడటంతో.. అక్కడ బలపడేందుకు అరవింద్ కేజ్రీవాల్ తనదైన వ్యూహలతో అడుగులు వేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం కావడంతో ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చాటిటే.. దీని ప్రభావం 2024 సాధారణ ఎన్నికలపై ఉంటుందనేది కేజ్రీవాల్ ప్లాన్ గా తెలుస్తోంది.గుజరాత్ లో ఓ ప్లాన్ ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుతూ వస్తోంది. 1998 నుంచి 25 ఏళ్ల పాటు బీజేపీ గుజరాత్ లో అధికారంలో ఉంటూ వస్తోంది. సాధారణంగా దీర్ఘ కాలం పాలించిన ఏ ప్రభుత్వంపై అయినా ప్రభుత్వ వ్యతిరేకత కన్పించడం సహజం. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను పొందడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందుతుండటం, నాయకత్వ లోపంతో హస్తం పార్టీ గుజరాత్ లో అనుకున్నంత ఫెర్ఫార్మెన్స్ ఇవ్వకపోతుండటంతో.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమవైపు తిప్పుకునేందుకు ఆప్ గత కొనేళ్లుగా తన ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుదల హస్తం పార్టీకి నష్టమేనని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. గుజరాత్ లో డిసెంబర్1 వ తేదీన మొదటి దశ, 5వ తేదీన రెండో విడతలో ఎన్నికలు జరగనుండగా, 8వ తేదీన ఓట్లు లెక్కిస్తారు. ఎప్పుడూ ద్విముఖ పోరు కనిపించే గుజరాత్ లో ఈ సారి త్రిముఖ పోటీ తప్పదనే అంచనాలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఏ మేరకు గుజరాత్ లో సత్తా చాటుతుందనేది ఆసక్తికరంగా మారింది.

 

Tags: A three-way contest in Gujarat

Post Midle

Leave A Reply

Your email address will not be published.