జిల్లాలో మొత్తం 2,71,696 మందికి రూ.181 కోట్లు పెన్షన్ ల పంపిణీ

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సామాజిక భద్రత పెన్షన్ ల పెంపు హామీ అమలులో మొదటి కేటగిరి లోని వృద్దాప్య, వితంతు, ఒంటరి మహిళ తదితర వర్గాల వారికి పెన్షన్ లను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది.. ఇందులో 11 కేటగిరీలకు చెందిన వారి ఫించను సొమ్మును రూ.3 వేల నుండి రూ.4 వేలకు పెంచిన నేపథ్యంలో జూలై 1 వ తేదీన రూ.4 వేలతో పాటు ఏఫ్రిల్, మే మరియు జూన్ మాసాలకు సంబందించి పెరిగిన ఫించను సొమ్ము నెలకు రూ.1,000/- ల చొప్పున మూడు మాసాల అరియర్స్ కలుపుకుని మొత్తం రూ.7,000/-లను పంపిణీ చేయడం జరుగుతుంది.. రెండవ కేటగిరీలోని పాక్షిక దివ్యాంగులకు రూ.3 వేల నుండి రూ.6 వేలకు, మూడో కేటగిరీలోని పూర్తి స్థాయి దివ్యాంగులకు రూ.5 వేల నుండి రూ.15 వేలకు మరియు నాలుగవ కేటగిరీలోని కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఝకాలిక వ్యాధులతో బాధపడేవారికి రూ.5 వేల నుండి 10 వేలకు పెంచిన ఫించను సొమ్ము పంపిణీ.

జిల్లాలో మొత్తం 2,71,696 మందికి రూ.181 కోట్లు పెన్షన్ ల పంపిణీ . ఇందులో

వృద్ధాప్య పెన్షన్ కింద 1,45,035 మందికి రూ.101.52 కోట్లు

నేతన్న పెన్షన్ కింద 2,572 మందికి రూ.1.80 కోట్లు

వితంతు పెన్షన్ కింద 59,993 మందికి రూ.42 కోట్లు

వికలాంగుల పెన్షన్ కింద 35,803 మందికి రూ.21.48 కోట్లు

అభయహస్తం కింద 11,311 మందికి రూ.56.56 లక్షలు

కల్లు గీత కార్మికులు 561 మందికి రూ.39 లక్షలు

హిజ్రాలు 32 మందికి రూ.2.24 లక్షలు

ఒంటరి మహిళల పెన్షన్ కింద 5,761 మందికి రూ.4.03 కోట్లు

మత్స్యకారులు 249 మందికి రూ.17.43 లక్షలు

డప్పు కళాకారులు 6,290 మందికి రూ.4.40 కోట్లు

చర్మకారులు 796 మందికి రూ.55.72 లక్షలు

కళాకారుల పెన్షన్ కింద 70 మందికి రూ.4.90 లక్షలు

సైనిక్ వెల్ఫేర్ పెన్షన్ కింద 61 మందికి రూ.3.05 లక్షలు

డి ఎం హెచ్ ఓ కింద 2,740 మందికి రూ.3.57 కోట్లు

సి కె డి యు ప్రైవేట్ కింద 254 మందికి రూ.25.40 లక్షలు

సి కె డి యు ప్రభుత్వం కింద 168 మందికి రూ.16.80 లక్షలు పంపిణీ.

జూలై 1 న గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులతో ఫించనుదార్ల ఇంటి వద్దే ఫించను సొమ్మును పంపిణీ, అవసరం మేరకు ఇతర శాఖల ఉద్యోగులను వినియోగించడం జరుగుతుంది..ఒక్కొక్క ఉద్యోగి ద్వారా 50 గృహాల చొప్పున ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం.. సాధ్యమైనంత మేర ఒకే రోజు ఈ ఫించన్ల పంపిణీ పూర్తి…. అనివార్య కారణాల వల్ల ఇంకా ఎవరన్నా మిగిలిపోయి ఉంటే రెండో రోజు కూడా ఈ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది..

 

 

 

Tags:A total of 2,71,696 people in the district have been distributed pensions of Rs.181 crores

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *