Natyam ad

2246 ప్లాట్లకు మొత్తం 33,161 దరఖాస్తులు

హైదరాబాద్ ముచ్చట్లు:

రాజీవ్ స్వగృహ ఇండ్ల అమ్మకాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 27 నుంచి లాటరీ పద్ధతిలో ప్లాట్లను కేటాయించనున్నారు. రాజీవ్స్వగృహ, హెచ్ఎండీఏ సంయుక్తంగా విక్రయిస్తున్న ఈ ఫ్లాట్లకు ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. అయితే, లాటరీ ద్వారా కేటాయించనుండటంతో.. దరఖాస్తు చేసుకున్న వారందరికీ టోకెన్నెంబర్లు ఇస్తున్నారు.కాగా బండ్లగూడలోని 2246 ప్లాట్లకు మొత్తం 33,161 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో త్రిబుల్బెడ్ రూం డీలక్స్ప్లాట్లకు అత్యధికంగా 16,679 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక పోచారంలోని 1470 ఫ్లాట్ల కోసం 5,921 దరఖాస్తులు వచ్చాయి. వీటికి ఆన్లైన్‌లో దరఖాస్తులు చేసుకోగా.. ముందుగా బుకింగ్ రుసుంగా రూ. 1000 చొప్పున వసూలు చేశారు. దీంతో సర్కారుకు రూ. 3.90 కోట్లు ఆదాయం వచ్చింది. ఒక వ్యక్తికి ఒకే ఫ్లాట్‌ను కేటాయించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆధార్ కార్డు ఆధారంగా ఒక్కొక్కరిని నమోదు చేయనున్నారు.గంపగుత్తగా టవర్ల వారీగా విక్రయించేందుకు నోటిఫికేషన్ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ, రియల్సంస్థలు ముందుకు రాకపోవడంతో.. ఒక్కొక్కటిగా విక్రయాలు చేస్తున్నారు. ఈ నెల 27 నుంచి వచ్చేనెల 1 వరకు లాటరీ ద్వారా ఫ్లాట్లను కేటాయించనున్నట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం లాటరీ ప్రక్రియను వీడియోగ్రఫీ చేయాలని, ప్రత్యక్షప్రసారం కూడా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

 

Tags: A total of 33,161 applications were received for 2246 plots

Post Midle
Post Midle