ఖరీఫ్‌సీజన్‌లో 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

A total of 45 lakh metric tonnes of cereals in Kharifijan

A total of 45 lakh metric tonnes of cereals in Kharifijan

Date:18/09/2018
‘ఏ’ గ్రేడ్‌కు రూ.1,770 క్వింటాలుకు
సాధారణ రకానికి  రూ.1,750 క్వింటాలుకు
అక్టోబర్ 1వ తేదీ నుంచి ధాన్యం సేకరణ
ధాన్యం సేకరణకు 1500 కొనుగోలు కేంద్రాలు
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
అమరావతి ముచ్చట్లు :
 రాష్ట్రంలో ఈఏడాది 2018-19 ఖరీఫ్‌సీజన్‌లో 45 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర పౌరఫరాల శాఖ మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సోమవారం నాడు వెలగపూడి సచివాయంలోని తన కార్యాలయం నందు ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం సేకరణపై పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు, రైస్ మిల్లర్ల సంఘాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాతూ ఖరీఫ్‌సీజన్‌కు సంబంధించి 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు.
ఖరీఫ్‌సీజన్‌కుగాను ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త మద్దతు ధరలు ఈ సీజన్ నుంచి అమల్లోకి రానున్నాయని ఆ ప్రకారం సాధారణ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.1750, ‘ఏ’ గ్రేడ్‌రకం ధాన్యానికి రూ.1770గా కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఆయకట్ట పెరిగినందున వరి ధాన్యం లభ్యత 2018-19 ఖరీఫ్ సీజన్‌లో 86.17 లక్షల టన్నులు ఉత్పత్తి ఉంటుందని అంచనా వేశారు. ధాన్యం అమ్మకాల్లో రైతులు దోపిడీకి గురికాకుండా వ్యవస్థను విస్తృత పరుస్తూ “రైతుల పొలం కళ్లాలు వద్దనే ధాన్యం కొనుగొళ్ళు” అనే వ్యవస్థను అమల్లోకి తెచ్చినట్లు మంత్రి తెలిపారు.
కొత్త విధానంలో భాగంగా కళ్లంలో ధాన్యాన్ని కొన్నప్పుడే రైతు భూమి, సర్వే నంబర్, పంట మొత్తం వివరాలను రికార్డు చేసి కొనుగోలు రసీదు ఆ ధాన్యాన్ని మిల్లుకు తరలించేందుకు అనుమతి పత్రం ఇవ్వడం జరుగుతుందన్నారు. మద్దతు ధరలతో రైతుల నుంచి ధాన్యంను కొనుగోలు చేసి  48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. లక్ష్యంకు మించి అధికంగా  ధాన్యం వస్తే కొనుగోలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి ధాన్యంను కొనుగోలు చేసేందుకు రాష్టంలో సూమారు 1500 ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ధాన్యం సేకరణకు అవసరమైన సంచులు, బియ్యం నిల్వ చేయడానికి గోదాములు, రైస్ మిల్లుల ఎంపిక, రైస్ మిల్లర్లతో ఒప్పందాలు, బ్యాంకు గ్యారెంటీలు, ధాన్యం సేకరణ రవాణాకు అవసరమైన చర్యలను పౌరసరఫరాల సంస్థ చేపట్టడం జరుగుతుందన్నారు.  ఈ ఖరీప్ సీజన్ నుండి సేకరించిన ధాన్యంను రకాలు వారీగా మిల్లుల్లో నిల్వ చేయాలని రైస్ మిల్లర్లకు మంత్రి సూచించారు. మన రాష్ట్రంలో ప్రజలు తినటానికి ఇష్టపడని MTU 1001, మరియు 1010 రకాల ధాన్యం ఉత్పత్తిని ఈ ఖరీఫ్ సీజన్‌లో మాత్రమే సాగు చేయడానికి అనుమంతించబడిందన్నారు.
2019-20 ఖరీఫ్ సీజన్ నుంచి ఈ రకపు ధాన్యాన్ని సాగు చేయడాన్ని ప్రభుత్వం ప్రోత్సహించదని మంత్రి అన్నారు. విత్తనాల సరఫరాను కూడా అపేస్తామన్నారు.  ఈ ఖరీఫ్ సీజన్‌లో సేకరించబోయే MTU 1001, 1010 రకానికి సంబంధించిన ధాన్యం/బియ్యంను బహిరంగ మార్కెట్‌లలో అమ్ముకొనుటకు పౌరసరఫరాల సంస్థకు అనుమతి ఇవ్వబడిందన్నారు. గత సంవత్సరం వలే ఈ సంవత్సరం కూడా మిల్లర్ల నుండి, వారికి సరఫరా చేయబోయే ధాన్యం విలువకు సమానంగా 1:1 బ్యాంకు గ్యారెంటీ తీసుకోబడుతుందని మంత్రి అన్నారు.
రాష్ట్రంలో ఏ మిల్లర్‌కు బ్యాంకు గ్యారెంటీకి మినహాయింపు లేదన్నారు. ధాన్యం సేకరణ కేంద్రాల్లో తేమ కొలిచే యంత్రాలు, బరకాలు, ధాన్యం ఎగరపోత యంత్రాలు, జల్లెడలు తదితర యంత్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా మిల్లర్లు వారికి చెల్లించవల్సీన బకాయిలు అనగా మండి లెబర్, రవాణ చెల్లింపులు, డ్రైయెజ్, కస్టోడియన్ ఛార్జీలు, రవాణా ఛార్జీలు వెంటనే చెల్లించాలని మంత్రిని కోరారు.మిల్లులకు సరఫరా చేసే విద్యుత్‌ను 200 హెచ్‌పి వరకు లోటేన్షన్ క్యాటగిరీ కింద చేర్చాలని కోరారు. అందుకు మంత్రి స్పందిస్తూ మిల్లర్లుకు చేల్సించాల్సీన సొమ్మును వెంటనే చెల్లిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
అలాగే మిల్లర్లు పీడీఎస్ రైస్ రీసైక్లింగ్ చేసిన, తీసుకున్న ధాన్యానికి సకాలంలో బియ్యం ఇవ్వకపోయిన,  ప్రజా పంపిణీ వ్యవస్థకు కేటాయించిన బియ్యంను కొనుగోలు చేసినా వారిపై కఠన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటి వరకు చెల్లించని ధాన్యం రావాణా ఛార్జీలను వాస్తవంగా ఏవరైతే రవాణా చేశారో వారికి సొమ్ము చెల్లిస్తామని మంత్రి అన్నారు. ఈ సమావేశంలో కమిషనర్ బి. రాజశేఖర్, ఎండీ ఏ సూర్యకుమారి, రాష్ట్ర రైస్ మిల్లర్ల  సంఘం ప్రెసిడెంట్ గుమ్మడి వెంకటేశ్వరరావు, జిల్లాల రైస్ మిల్లర్ల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Tags:A total of 45 lakh metric tonnes of cereals in Kharifijan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *