పుంగనూరు నియోజక వర్గం లో బొమ్మల పరిశ్రమ ఏర్పాటు చేయాలి

Date:18/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

A toy industry should be set up in Punganur constituency

ప్రధాన మంత్రి జన్ కళ్యాణ్ కారి యోజన రాష్ట్ర అధ్యక్షుడు అయూబ్ అలీ ఖాన్
ప్రధాని నరేంద్ర మోది పిలుపు మేరకు ఆత్మ నిర్భర భారత సాధన కొరకు మరియు వోకల్ ఫర్ లోకల్ కాన్సెప్ట్ లో భాగంగా దేశం లో సాంప్రదాయ బొమ్మల తయారీ కుటుంబాల అభ్యున్నతి మరియు ప్రోత్సహానికి బలమైన విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి జన్ కళ్యాణకారి యోజన రాష్ట్ర అధ్యక్షుడు పి అయూబ్ అలీ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. దేశీ టాయ్ తయారీ క్లస్టర్స్ మరియు భారతీయ పౌరాణిక భావనలతో కాన్సెప్ట్ ధీమ్ తో కూడిన వీడియో గేమ్ లను ప్రోగ్రామింగ్ చేసే కంపెనీలకు ప్రోత్సహం అందించాలని అయూబ్ ఖాన్ అన్నారు , టాయ్ మాన్యుఫాక్షరింగ్ పార్క్ ద్వారా అనేక మంది స్థానికులు ఉపాధి పొందుతారని ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం కూడా సమకూరుతుంది .

 

 

కాన్ఫెడరేషన్ అఫ్ అల్ ఇండియన్ ట్రేడర్స్ ప్రకారం భారతీయ బొమ్మల పరిశ్రమ యొక్క వార్షిక టర్నోవర్ 25,000 కోట్లు 65% చైనా బొమ్మల పరిశ్రమ స్వాధీనం చేసుకుందని , భారత దేశం లో బొమ్మల పరిశ్రమ గురించి లోతుగా అధ్యయనం చేసి దేశీయ బొమ్మల పరిశ్రమకు పెద్ద ఎత్తున ప్రోత్సహం ఇవ్వాలని అయూబ్ ఖాన్ కోరారు. జాతీయ విధానం మరియు నిపుణుల కమిటీ తో కూడిన రాజ్యాంగ వ్యవస్థల సహకారం తో సాధ్యమవుతుందని ఖాన్ అభిప్రాయ పడ్డారు. ఈ విషయమై కేంద్ర సూక్ష్మ , చిన్న , మధ్యతరహా పరిశ్రమల గౌరవమంత్రి నితిన్ జై రామ్ గడ్కరీ , సహాయ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి , కేంద్ర కమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ లా అండ్ జస్టిస్ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్కి ,సహాయ మంత్రి సంజయ్ ధోత్రే వారి కి లేఖలు పంపినట్లు తెలిపారు. ఈ విషయము పై మా నియోజక వర్గ ఎంపీ మిదున్ రెడ్డి  చొరవ తీసుకుని స్పందించాలని అయూబ్ ఖాన్ కోరారు.

ఆంధ్రప్రదేశ్ మొదిలియార్ కార్పొరేషన్ కి చైర్మన్ గా బుల్లెట్ సురేష్

Tags: A toy industry should be set up in Punganur constituency

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *