బతుకు చిత్రం మారని గిరిజన పల్లెలు

అల్లూరి ముచ్చట్లు:

స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్న నేటికీ రోడ్డు త్రాగునీరు లేని గ్రామాల గిరిజనులు అనేక అవస్థలుపడుతున్నారు.ప్రభుత్వాలు పాలకులు అధికారులు మారిన గిరిజన జీవితాల్లో బ్రతుకు చిత్రం మారనే లేదు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు గిరిజన ఆదివాసీల సంక్షేమం అభివృద్ధి కోసం కేటాయించిన అవి మారుమూల గిరిజన పల్లెలకు చేరడం లేదు.దానికి గల కారణం ఇక్కడ ప్రభుత్వలది తప్పా పాలకుల చేతకాని తనమా అధికారులు ఉద్యోగుల నిర్లక్ష్యమా … ప్రజల అమాయకత్వమా … అనేది అంతుచిక్కని ప్రశ్న… ఆదివాసీల కోసం ప్రత్యేక చట్టాలు వ్యవస్థలు అధికారులు ఉద్యోగులు ఉన్నప్పటికి కనీస అవసరాలులో రహదారి త్రాగునీరు లేని గిరిజన గ్రామాలు అనేకం.కొండల్లో కోనల్లో దుర్భర జీవితాలు గడుపుతున్నారు.ప్రస్తుత అల్లూరి సీతరామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని జీనబాడు పంచాయతీ పరిధి వలసగరువు గ్రామంలో గత కొన్నేళ్లుగా సుమారు పది కుటుంబాలు గిరిజనులు అటవీ పలాశయం కొండపోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.ఈ  గ్రామం మూడు వైపులా రైవాడ జలాశయం ఉండగా ఒకవైపు దట్టమైన అడవులు ఉన్నాయి.ఏ అవసరానికైనా అనారోగ్య సమస్య వచ్చిన నాటుపడవల మీద ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని అవతలకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నామని వాపోతున్నారు. అనేక మార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు సమస్య తీర్చమని దరఖాస్తు చేసిన నేటికీ సమస్య తిరకపోవడంతో గత రెండు సంవత్సరాల నుండి సుమారు నేటికీ నాలుగు కిలోమీటర్లు కొండను తవ్వి రహదారి చేసుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

 

Tags: A tribal village where the image of life has not changed

Leave A Reply

Your email address will not be published.