విశ్వాశాంతి కోసం 2 కిలోల నువ్వుల నూనె తాగిన ఆదివాసీ మహిళ
అసిఫాబాద్ ముచ్చట్లు:
అసిఫాబాద్ జిల్లా నార్నూర్ ఖాందేవుని సన్నిధిలో విశ్వశాంతి కోరుతూ తొడసం వంశ ఆడపడుచు మడావి ఏత్మా బాయి 2 కిలోల నువ్వుల నూనెను త్రాగింది. ఆదివాసీ తొడసం వంశస్థుల ఖాందేవ్ జాతర ఏటా పుష్య మాస పౌర్ణమి రోజు ప్రారంభమవుతుంది.. మరుసటి రోజు ఆ వంశ ఆడపడుచు బంధు వులు ఇంటింటా తయారు చేసిన నువ్వుల నాటు నూనెను సేకరిస్తారు. కంచు పాత్ర నిండా నూనె పోగు చేస్తారు. తొడసం కటోడ ఖాందేవునికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆడపడుచు ఆ నూనెను తాగడం ఆనవాయితీ. ఈ సందర్భంగా తొడసం వంశ కటోడ పూజారి తొడసం బాపురావు పటేల్ మాట్లాడుతూ తొడసం వంశంలో జన్మించిన ఒక ఆడపడుచు మూడు సంవత్సరాల పాటు ఏటా నూనె తాగవలసి ఉంటుందన్నారు. పంటలు బాగా సమృద్ధిగా పండి ప్రపంచమంతా సుభిక్షంగా ఉంటుందని ఆదివాసీల నమ్మకం అని చెప్పారు. అసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతు ఖాoదేవుని అలయాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: A tribal woman who drank 2 kg of sesame oil for peace of mind