Natyam ad

గ్రామ గ్రామాన కమ్యూనిటీ హాల్  ఏర్పాటు చేయాలి

– వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వారి ఆరోగ్యం పై అవగాహన కల్పించాలి

– అర్ సి పి డిమాండ్

కడప ముచ్చట్లు:

Post Midle

దివంగత నేత  వైయస్ రాజశేఖర్ రెడ్డి కలలను  నెరవేర్చడం అంటే గ్రామ గ్రామాన కమ్యూనిటీ సెంటర్లను, గ్రామ నత్తాన్ని ఏర్పాటు చేయడమేనని, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ చింతకొమ్మదిన్నె మండల కార్యదర్శి మడగలం ప్రసాద్ అన్నారు.
రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆర్ సి పి ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై పర్యటనలు 3,రోజు బలిజ పల్లి, నాయనవారి పల్లెలో పర్యటించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో
పాతకాలం నాటి అలవాట్లను రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించేవారని గ్రామంలోని ప్రజలు ఎవరికి వారుగా ఉన్న రోజుల్లో ఓకే కుటుంబం గా ఉండాలన్న ఆయన సంకల్పం ప్రకారం రచ్చబండలు ఏర్పాటు చేశారని, ఇప్పుడు ఆయన తనయుడిగా ఆయన కన్న కలలను నీవు నెరవేర్చాలని గ్రామ గ్రామాన కమ్యూనిటీ సెంటర్లను, గ్రామ నత్తాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

 

 

 

గతంలో, గ్రామ గ్రామాన గ్రామచావిడిలు, పశు పోషణ కలిగిన గ్రామాలలో గ్రామ నత్తలు ఉండేవని  ప్రస్తుతము అవి మచ్చుకైనా  కనపడడం లేదని ఆయన తెలిపారు.
గ్రామ చావడీలలో గ్రామ ప్రజలందరూ కూడుకొని గ్రామ అభివృద్ధి కోసం చర్చించుకునే వారని ఆ గ్రామంలో ఏదైనా కార్యాలు జరిగినప్పుడు అందులో నిర్వహించే వారిని, అలాగే గ్రామ నత్తం వల్ల కూడా ఆ గ్రామంలోని  పశు పోషణ సమృద్ధిగా ఉండేదని ఈరోజు ఆ రెండు ఎక్కడ కనిపించటమే లేదని గ్రామ గ్రామాన కమ్యూనిటీ సెంటర్లు గ్రామ నత్తాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పశు పోషణ సమృద్ధిగా పెరిగి గ్రామంలోని ప్రజలు ముఖ్యంగా  పింఛని పంపిణీ కోసం గ్రామ అభివృద్ధి ఇతర ప్రజల ప్రభుత్వ అవసరాలకు వాటిని ఉపయోగించుకోవచ్చు అని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ సి పి నగర  కార్యదర్శి వర్గ సభ్యులు రమేష్ ఇందిరానగర్ కార్యదర్శి రవి,ఉదయ్ మస్తాన్,బాబా సాహెబ్ పాల్గొన్నారు.

 

Tags; 332A village community hall should be established

Post Midle