మైలసముద్రంలో పల్లె పర్యటన

సత్యసాయి ముచ్చట్లు:

సత్యసాయి జిల్లా (కొత్తచెరువు )కొత్తచెరువు మండలం మైలసముద్రం లో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పర్యటించారు. మైలసముద్రం లో విశ్రాంత ఎంఇఓ ఈరోజు ఆకస్మాత్తుగా మృతి చెందిన పురాణం ప్రభాకర్ రావు (70) మరణ వార్త తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి హుటాహుటిన అనంతపురం నుంచి మైలసముద్రం గ్రామానికి విచ్చేశారు. మృతుడు ప్రభాకర్ రావు భౌతికాయనికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభాకర్ రావు మృతి అత్యంత బాధాకరం అన్నారు. ఆ కుటుంబానికి తీరని లోటు . ఏ కష్టం వచ్చినా ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. భర్త మృతితో దుఃఖ సాగరంలో ఉన్న ప్రభాకర్ రావు సతీమణి , వారి ఇద్దరు కుమారులను మాజీ మంత్రి ఓదార్చారు. మాజీ మంత్రి తో పాటు టీడీపీ మండల కన్వీనర్లు రామకృష్ణ, శ్రీనివాసులు, టీడీపీ సీనియర్ నాయకులు సాలెక్క గారి శ్రీనివాసులు, కిలారి శ్రీనాథ్, సుబ్రమణ్యం,గణేష్, ప్రభాకర్రావు గారి బంధువులు మంజునాథ్, తదితరులు పాల్గొన్నారు.

 

Tags: A village tour in Mylasamudra

Leave A Reply

Your email address will not be published.