చంద్రబాబుకు ఘన స్వాగతం
గన్నవరం ముచ్చట్లు:
ఇదేమి కర్మరాష్ట్ర వ్యాప్త కార్యక్రమానికి ఏలూరు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం బయలుదేరారు. ఏలూరు జిల్లా పర్యటనకు బయలుదేరిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు టిడిపి నేతలు కలపర్రు టోల్ ప్లాజా వద్ద ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కలపర్రు టోల్ ప్లాజా వద్ద మాజీ సీఎం చంద్రబాబుకు మహిళలు హారతులు పట్టారు. కలపర్రు టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారి పసుపు మయంగా మారింది. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు టిడిపి నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.
Tags; A warm welcome to Chandrababu

