Natyam ad

పుంగనూరులో గడప గడపకు ఘన స్వాగతం – ఎంపీపీ భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని భీమగానిపల్లెలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. సోమవారం ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి , మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్‌తో కలసి ఇంటింటికి వెళ్లి బుక్‌లెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పూల బోకేలు ఇచ్చి మంగళహారతులతో స్వాగతం పలికారు. ప్రభుత్వ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపీపీలు ఈశ్వరమ్మ, సరోజమ్మ, పార్టీ నాయకులు చంద్రారెడ్డి యాదవ్‌, రమణ, సుబ్రమణ్యంతో పాటు సచివాలయ కార్యదర్శులు, వలంటీర్లు పాల్గొన్నారు.

Post Midle

Tags: A warm welcome to Gadapa Gadapa in Punganur – MPP Bhaskar Reddy

 

Post Midle

Leave A Reply

Your email address will not be published.