Natyam ad

పుంగనూరులో గడప గడపకు ఘన స్వాగతం – ఎంపీపీ భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చిన ప్రజాప్రతినిధులకు గురువారం ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్‌ కలసి మండలంలోని జెట్టిగుండ్లపల్లె, కంగానెల్లూరు, గెరిగపల్లె గ్రామాల్లో పర్యటించారు. ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల సహకారంతో మంగళం పంచాయతీలో అర్హులైన పేదలందరికి సంక్షేమ పథకాలు అందించి ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నామన్నారు. అలాగే సచివాలయాలు, ఆర్‌బికెలు, వెల్‌నెస్‌ సెంటర్ల ద్వారా ప్రజలకు , రైతులకు ఇంటి వద్దనే సేవలు అందిస్తున్నామన్నారు. రైతులకు అవసరమైన సలహాలు, సూచనలతో పాటు ఎరువులు, విత్తనాలు , యంత్రాలు ఆర్‌బికెలలో అందుబాటులో ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ వనజమ్మ, వైఎస్సార్‌సీపీ నాయకులు రాజారెడ్డి, జయరామిరెడ్డి, సురేంద్రరెడ్డి, రామచంద్రారెడ్డి ,రాజశేఖర్‌రెడ్డి, ఖాదర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: A warm welcome to Gadapa Gadapa in Punganur – MPP Bhaskar Reddy

Post Midle